అష్టైశ్వర్యములు ఎన్ని ?
.....................................................
శివచిహ్నాలు ఐదు అవి
(1) దండం (2) కమండలం (3) రుద్రాక్ష (4) జటాజూటం (5) కాషాయం.
అగ్నులు నాలుగు రకాలు అవి (1) బడబాగ్ని, సముద్రంలో పుడుతుంది.
(2) జఠరాగ్ని, కడుపులో పుడుతుంది. తిన్నదంతా జీర్ణం చేస్తుంది.
(3) గృహగ్ని, ఇంటిలో వుండేది. వంటకు పెట్టేమంట, యజ్ఞయాగాలలో రాజేసేమంట.
(4) దావానలం, అడవిలో పుట్టేమంట.
పంచలోహాలు --
(1)బంగారం, (2) వెండి, (3) రాగి, (4) ఇత్తడి, (5) ఇనుము
సప్తలోహాలు (6) సీసం (7) తగరం
అష్టలోహాలు (8) కంచు.
అష్టైశ్వర్యములు
(1) ధనం (2) ధాన్యం (3) సంతానం (4) విజయం (5) ధైర్యం (6) ఆయుధబలం (7) రాజ్యం / భూములు (8) వాహనాలు.
అష్టకష్టాలు
(1) విదేశీగమనం. ఉన్నఊరును వదలి పరదేశానికి పోవడం.
(2) భార్య/భర్త వియోగం.
(3) అపదకాలంలో ఇంటికి బంధువులు రావడం.
(4)ఉచ్చిష్ఠభోజనం / ఎంగిలితినడం.
(5) శత్రువులతో స్నేహం
(6) పరాన్నభోజనం.ఇతరులపై ఆధారపడి బ్రతకడం.
(7) అప్రతిష్ఠ / అవమానాల పాలుకావడం.
(8) దరిద్ర్యం.
..................................................................................................సేకరణ:- జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
Hi Please, Do not Spam in Comments