కథ - నూతిలో పడిన గాడిద - A to Z 2512

HIGHLIGHTS

రామాపురం గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక ముసలి గాడిద ఉండేది. ఒకరోజు గాడిద మేతమేస్తు చూసుకోకుండా ఒక ఎండిపోయిన నూతిలో పడిపోయింది. గాడిద కి దెబ్బలు తగిలి చాలా బాధ పడింది. అలా గంటలు గడిచాయి. చివరకు గాడిద మూలుగు విని రైతు దానిని గుర్తించాడు. 

అది ముసలి ది అవ్వడం మూలన ఇక బయటకు తీసి ప్రయోజనం లేదు అని అనుకునీ గాడిడతో పాటు నూతిని కూడా కప్పి వేద్దాం అనుకున్నాడు.

అందుకు అతడు ఇరుగు పొరుగు వారిని పిలిచి మట్టితో కప్పడం మొదలుపెట్టాడు. అందరూ తలా కొంచెం  వేసిన మట్టి గాడిదమీద పడడం మొదలుఅయ్యింది. మొదట అక్కడ జరుగుతున్న విషయం గాడిదకు అర్దం అయ్యి బోరున ఎడవడం మొదలుపెట్టింది. తరువాత నిశ్శబ్దంగా ఉండి ఆలోచించం మొదలుపెట్టింది.

కొంత మట్టివేసిన తరువాత గాడిద చేస్తున్న పనిని చూసి రైతు అవక్కూ అయ్యాడు. దానిమీద పడిన మట్టిని దులుపుకొని కొత్త మట్టిపై నిలుచునేది.

అలా ప్రతిసారీ వేసిన మట్టిని దులుపుకొని, నిండిన మట్టి పై కొత్త అడుగు వేసి నిలుచునేది.
చివరకు నూతి నీిండే టప్పటికి బయటకు వచ్చేసి, ప్రాణాలతో బయట పడింది.

నీతి: 

జీవితంలో బరువులు, బాధ్యతలు, కష్టాలు అనే మట్టి మనమీద ఎప్పుడూ పడుతునేవుంటుంది.

 👉దానిని నీ తెలివితేటలతో విదు లించుకొని కొత్త అడుగు తీసుకోవాలి కానీ అగిపోకూడదు.🍁

No comments