ఆకలితో ఉన్నవాడు రాయితో కొడితే ఎటూ కదలలేని చెట్టే పళ్ళు ఇస్తుంటే - A to Z 2512

HIGHLIGHTS

భారతదేశం ఒకప్పుడు చిన్న చిన్న దేశాలుగా ఉండేది. ఆంధ్రదేశం, కన్నడదేశం. ఇలా వుండేది. అలా ఒక దేశపు రాజుగారు తన భటులతో, మంత్రులతో కలిసి తన దేశంలో ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం బయలుదేరాడు. అలా వెళుతూ ఉండగా ఒక రాయి వచ్చి తలకి తగిలి బాగా నెత్తురు కారిపోయింది. పక్కనే ఉన్న భటులు చుట్టూ వెతికి బక్కచిక్కి, డొక్కలు ఎండి, గోచి పెట్టుకున్న వ్యక్తీ ఒకడు కనిపించాడు. వాడిని లాక్కొచ్చి రాజు ముందు నిలబెట్టారు. రాజుగారు వాడిని పైనుండి క్రింది వరకు చూసి ఎవరు నువ్వు? రాయితో ఎందుకు కొట్టావు?అని అడిగితె! నేను నేరేడు పండుకోసం చెట్టుమీదకి రాయి వేస్తె అది పొరపాటున వచ్చి మీకు తగిలింది. క్షమించండి అన్నాడు. పక్కనే ఉన్న మంత్రులు, భటులు వీడని క్షమించేది ఏమిటి? ఉరి శిక్ష వేయండి అని అన్నారు. రాజు మంత్రులవైపు, చూసి నవ్వి భటులతో ''ఈకుర్రాడి ఇంటికి ఒక సంవత్సరానికి సరిపడా ఆహారధాన్యాలు పంపించండి'' అని ఆజ్ఞ వేశాడు. అందరు ఆశ్చర్యపోయి! అదేమిటి మహారాజ మిమ్మల్ని రాయితో కొడితే ఆహారధాన్యాలు పంపమంటున్నారు? అన్నారు. రాజు చిరుమందహాసం చేసి ఆకలితో ఉన్నవాడు రాయితో కొడితే ఎటూ కదలలేని చెట్టే పళ్ళు ఇస్తుంటే, ఒక దేశానికి రాజునైవుండి ప్రజలు యోగక్షేమాలు చూడవలసిన నేను ఇంకెన్ని ఇవ్వాలి? అన్నాడు. ఇది ప్రజలను ఏలే ప్రభువులు చేయవలసినది. ఇది 250 సంవత్సరాల క్రిందట జరిగిన యధార్ధగాధ.💐💐

No comments