గ్రామానికున్న నిజమైన పేరేమిటి ?

గ్రామానికున్న నిజమైన పేరేమిటి ?

SHYAMPRASAD +91 8099099083
0
 గ్రామానికున్న నిజమైన పేరేమిటి ?
..................................................

 తమిళనాడులోని ప్రముఖ సిటీ కొయంబత్తూరు పేరు మార్చారు. ఇక నుంచి దీనిని కొయంపుత్తూరు గా పిలవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఇంగ్లీష్ స్పెల్లింగ్ లోనూ మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఒకటి, రెండు కాదు ఏకంగా 1018 ఏరియాల పేర్లను మార్చుతూ 38 పేజీల జీవోను పళనిస్వామి సర్కార్​ గురువారం జారీ చేసింది.

 బ్రిటీష్ టైం లో తమిళనాడులోని చాలా ప్రాంతాల పేర్లను ఇంగ్లీష్ యాక్సెంట్ కు అనుగుణంగా మార్చారు. అలాంటి వాటన్నింటికీ తమిళ నేటివిటీ ఉండేలా మార్పు చేస్తు్న్నారు. ఇప్పటికే మద్రాస్ ను చెన్నై గా మార్చారు. తమిళనాడులో ఊళ్ల పేర్లను జనం ఎలా పలుకుతారో అదే విధంగా మార్చుతున్నారు. 

40 ప్రాంతాలకు సంబంధించి ఇంగ్లీష్ స్పెల్లింగ్ ల్లోనూ మార్పులు చేశారు. వీటిలో పలు జిల్లాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ లోనే పేర్ల మార్పుపై నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారికంగా గురువారం నుంచి మార్చిన పేర్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్స్, బోర్డులలో త్వరలోనే కొత్త పేర్లను రాయనున్నారు.

 ఈస్ట్ గోడావరి
వెస్ట్ గోడావరి
సామల్ కోట (సామర్లకోట)
సిద్ద్ అవుట్ (సిద్ధవటం, కడప జిల్లా)
భీమిలి (భీమవరం)
గుంటూర్ (గుంటూరు)
గూటి (గుత్తి)
నరసరావ్ పేట్ (నరసరావుపేట)
కందనవోలు (కర్నూలు)
నందేల (నంద్యాల)
డోన్ (ద్రోణాచలం)
నూజ్ వీడ్ (నూజివీడు)
విజియనగర్ (విజయనగరం)
మసులీపటం (మచిలిపట్నం)
పాల్ కోల్ (పాలకొల్లు)
A.కొండూరు ( అలిగిరి కొండూరు
N. కొండూరు (ఉత్తరకొండూరును నార్త్ కొండూరుగా మార్చి N.కొండూరుగా మార్చారు)
ODC ( ఓబుళదేవరచెరువు)
అనంటపూర్ (అనంతపురం)
కళ్యాణదుర్గ్ (కళ్యాణదుర్గం)
కుడైర్ (కూడేరు)

ఇలా వ్రాసుకొంటూపోతే వందలు కాదు వేలల్లో ఊరిపేర్లను ఆంగ్లేయులు మార్చారు. ఇంకా ఆ దాస్యాన్ని ఒక హోదాగా భావించి భరిస్తున్నాము.

గ్రామాల పేర్లను సక్రమంగా పలకాని,అందుకుగాను ప్రజలలో చైతన్యం రావాలి. ఆ చైతన్యంతో ప్రభుత్వం కన్ను తెరవాలి. గ్రామనామ స్వరూపాలు మారిపోవాలి.
........................................ . ..............................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!