Philosophy of " *Kupler Rose Model*

Philosophy of " *Kupler Rose Model*

SHYAMPRASAD +91 8099099083
0
మన దేశం లో  కరోనా బాధితుల సంఖ్య 100 ఉన్నప్పటి భయం ఇప్పుడు ఆ సంఖ్య 100, 000 దాటినా మనలో లేదు గమనించారా? 
దీనికి కారణం మన ఆలోచనాధోరణి లోని మార్పే!!
ఈ మార్పును Philosophy of 
" *Kupler Rose Model*" అంటారు!
ఎప్పుడైతే మానవుడు ఏదైనా విషాదం, ప్రకృతి విలయం, ప్రమాదం ఎదురైనప్పుడు 5 దశలకు లోనవుతాడు!
అవి 
1. తిరస్కరణ (denial)
2. కోపం (anger)
3. బేరం (bargain)
4. నిర్వేదం (depression)
5. ఒప్పుకోలు (acceptance)

*1. తిరస్కరణ (denial)*
విషమ స్థితి లో ఉండి కూడా ఇటువంటి స్థితి 
మనకు రాదు అని అనుకోవడం.
ఉదాహరణకు కరోనా వార్త తొలిసారి విన్నప్పుడు *ఇది మనదాకా రానేరాదు* అనుకున్నాం. తీరా వచ్చింతర్వాత కూడా *ఇంతటి ఉష్ణోగ్రతలో కరోనా వ్యాపించదు* అని నిరాకరించాం.
 
*2. కోపం (anger)*
మన యధాస్థితిని భగ్నం చేసేదేదయినా మనకు కోపం తెప్పిస్తుంది. 
ఉదాహరణకు మంచిగా సాగుతున్న మన జీవితాల్లో lock down వలన సంపాదన, సాధారణ జీవితం  కోల్పోవడం మనకు కోపం తెప్పించింది కదా? 

*3. బేరం (bargain)*
కరోనా ప్రభావం తక్కువ ఉంటే బావుండు, కనీసం తెలంగాణా లోనైనా తక్కువైతే బావుండు, త్వరగా వాక్సిన్ వస్తే బావుండు  అని లోలోపల ఆశపడడం.

*4. నిర్వేదం   (depression)*
అనుకున్నవిధంగా జరగక పోవడంతో లోలోన కుమిలిపోవడం.

*5. ఒప్పుకోలు (acceptance)*
ఇది చివరి దశ. ఇక వేరేదారేదీ లేక ఆ స్థితి ని అంగీకరించడం.
ఉదాహరణకు కరోనాకు నియంత్రణ తప్ప నివారణేదీ లేదని తెలిసి కరోనా తో మనం  సహజీవనానికి సిద్ధపడడం!

పై ఐదు దశలు కేవలం కరోనా కు మాత్రమే పరిమితం కాదు. మన జీవితం లో వచ్చే ప్రతి సమస్యకూ వర్తిస్తాయి!
 
తెలివైనవాడు ఏం చేస్తాడు? 
మొదటి దశ నుండి నేరుగా ఐదవ దశకు వెళ్లి సమయాన్ని, శక్తిని ఆదా చేసుకుని జీవితాన్ని సుఖమయం చేసుకుంటాడు. ఐదవ దశకు రాకుండా మిగిలిన దశల్లోనే కొట్టుమిట్టాడుకునే వాడు మతిస్థిమితం కోల్పోతాడు!!

సేకరణ 
*చందు ప్రకాష్*

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!