పిల్లలకి తెలుగు సాహిత్యాన్ని చేరువ చేయుట..ఆసక్తి పెంపొందించుట

వ్యాస రచన పోటీ
                   అంశం:-
పిల్లలకి తెలుగు సాహిత్యాన్ని చేరువ చేయుట..ఆసక్తి పెంపొందించుట
...........................................
తెలుగు లో మాట్లాడితే..100 రూపాయలు అపరాధ రుసుము చెల్లించు లేదా 100 గుంజీలు తీయు అని పసి మొగ్గలని హింసించే.. కార్పోరేట్ స్కూళ్ల యాజమాన్యాలకు...తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

ఉపోద్ఘాతం:- అమ్మా అని పిలిచినప్పుడు...నన్ను అమ్మా అంటే అన్నావు...నాన్నని..డాడీ అనే పిలువు అని చెప్పే తల్లులు ఉన్న ఈ తెలుగు నేల పై...
నన్ను గ్రాండ్ పా అనకు..చక్కగా తాతయ్యా అని పిలువు అని అమృత వాక్కులు కురిపించే తరం ఉన్నంత వరకు ..తెలుగు భాషకు వచ్చిన భయం లేదు...

వివరణ:- 
              చేత వెన్న ముధ్ద చెంగల్వ పూదండ ....చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు అని...చిన్ని కృష్ణుని చూపి..అమ్మమ్మో/ బామ్మో/తాతయ్యనో చెప్తూ ఉంటే...ఆ పలుకులు...చిట్టి చిట్టి గొంతుల్లో ప్రతిధ్వనిస్తుంటే...అది కదా స్వర్గం అంటే....

పిల్లలకి ఆనందం కలిగించేవి ఏవి..సాధారణంగా.. పుట్టిన రోజు పండుగలు..లేదా ..మామూలు పండుగలు...
పుట్టినరోజు పండుగ నాడు...అచ్చమైన తెలుగు ఆశీర్వచనాలు
ఆయురారోగ్య ఆయుశ్వర్యాభివృద్ది రస్తు అని...అక్షింతలు చల్లి...ఊహ తెలిసిన పిల్లలకు ఆ ఆశీర్వచనం...అర్ధం తెలియచెప్తే ఎంత సంతోషం .ఆ చిట్టి హృదయాలకు

చిరు జల్లులు పడే వేళ...వానా వానా వల్లప్పా...చేతులు చాచు చెల్లప్పా ..అని చిన్నారులకు నేర్పితే...వారి మొహాల్లోనే ఇంద్ర ధనుస్సు విరియదా

పలక బలపం పట్టించి...శ్రీ రాముని దయచేతను ..అంటూ...సరస్వతి నమస్తుభ్యం...అని అ..ఆ లు ..రాయిస్తుంటే..సాక్షాత్ ఆ చదువుల తల్లి  వారిని వొళ్ళో కూర్చో బెట్టుకోదూ

 తెలుగు పద్యాల మాధుర్యాన్ని..ప్రతిపదార్థాలతో చదివే బాల బాలికలకు..ఆ ...పద్యాలను..రాగయుక్తంగా పాడిన..ఆడియో లు.. చరవాణిలో.. వినిపిస్తూ ఉంటే...వారు విని...మళ్ళీ పాడుతుంటే...ఆ ఇ0ట్లో..కవితా కన్య...ఘల్లు ఘల్లుమనిపించదూ..

కుటుంబం...ఒక వ్యక్తిని.. బాల్య దశ నుండి కౌమారం వరకు.ఇలా.....ప్రభావితం చేస్తే...అంత కంటే ఇంకేం కావాలి...

ఇలా రాస్తుంటేనే ఒళ్ళు పులకరిస్తుంటే..ఇక నిజంగా జరిగితే ఎలా ఉంటుందో...

సూచనలు/సలహాలు:-

1. పసి హృదయాలు పిండి ముద్ద వంటివి...ఎలా మలిస్తే అలా
ఇంట్లో తప్పనిసరిగా తెలుగు మాట్లాడటం సాగితే..మిగతా అన్ని వాటంత అవే వస్తాయి
2. చిన్ని చిన్ని పదాలు..తో...వారాంతం లో..లేదా భోజనాల వేళ... అంత్యాక్షరి ఆడించడం...చాలా బావుంటుంది..మంచి ఫలితాన్ని ఇస్తుంది
3. ఇప్పుడు చరవాణి మన దైనందిన జీవితంలో ఒక భాగం...చంటి పిల్లలు ...చిన్న పిల్లలు అందుకు మినహాయింపు కాదు...అందులో చిన్న చిన్న చిట్టి కథల వీడియోలు...పాటలు చూపెట్టడం వలన తెలుగు చక్కగా వస్తుంది
4. మన టీవీ ల్లో..వచ్చే కార్టూన్ నెట్వర్క్ మరియు ఇతర ఛానెల్స్ ఇప్పుడు ప్రాంతీయ భాషలో ప్రసారాలు సాగిస్తున్నాయి..
అవి తెలుగు లో పెట్టినందువలన...చాలా బాగా తెలుగు వస్తుందు
5. మా పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థులు...డోరేమాన్.. ఒక గాడ్జెట్ తయారు చేసి నోబితకు ఇస్తాడు...
ఈ వాక్యాన్ని ఒక్క పొల్లు..అచ్చు తప్పు లేకుండా చెప్తారు
కానీ...వారికి అ.. ఆ లు కూడా రావు..
ప్రసార మాధ్యమాలకి ఉన్న శక్తి అటువంటిది
6. నెలకి ఒకసారి.. పిల్లల చేత...ఒక లక్ష్యం పెట్టి...ఈ ఫలనా పుస్తకం చదివితే నీకు ఇదిగో ఈ బహుమతి అని చెపితే తప్పక ఉత్సాహంగా చదువుతారు
7. ఆదివారం నాడు...తెలుగు ఉక్తలేఖనం రాయించడం...వంటివి...చేయవచ్చు...
8. చిన్ని చిన్ని నాటికలు వేయించడం...
9. అన్నిటి కంటే ముఖ్యంగా...తెలుగులో మాట్లాడటం...తెలుగులో చదవడం ..ఇటువంటివి .ఘోరమైన నేరాలు..పాపాలు కాదు అని ..ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలి...

ముగింపు:- అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, బాబాయ్, మామయ్య, పిన్ని, పెద్దమ్మ, తాతయ్య, అమ్మమ్మ, బామ్మ

ఈ పిలుపులు కుటుంబాల్లో ఉన్నంత కాలం...ఆ కుటుంబంలోని పిల్లలకు తెలుగు దూరం కాదు...కాబోదు...

జై తెలుగు తల్లి...
--- అరుణ 

Post a Comment

0 Comments