తెలుగుభాషనిపరిరక్షించుకొనుట

వ్యాస రచన పోటీ

              అంశం:తెలుగుభాషనిపరిరక్షించుకొనుట
----------------------------------------
ఎందరోమహానుభావులు..అందరికి వందనాలు...

ఉపోద్ఘాతం:-

ఒక బిడ్డతో...నీవు నీ తల్లిని సంరక్షించుకోవడానికి ఏమి చేస్తావు అని అడగాలి అంటే గుండె గొంతుక లోకి ఎలా వస్తుందో

వివరణ:-

ఇప్పుడు ఈ అంశానికి వ్యాసం రాయాలి అంటే కూడా అలాగే అనిపిస్తూంది...

ఎలా చెప్పాలి
..1..తెలుగులో మాట్లాడితే...మీకు ఒక .3 .మాసాల పాటు...చరవాణిలో ..అంతర్జాలం...ఉచితం...అని చెప్పాలా?
2. మమ్మల్ని
 ఆంటీ అంకుల్ అని కాకుండా...బాబాయ్/పిన్ని ..అత్తయ్య/మామయ్య ...అని పిలిస్తే..మీకు రైలు ప్రయాణం లేదా మరేదైనా ప్రయాణాలు ఉచితం అని చెప్పాలా?
3. గ్రంథాలయాలు అనే గనులను తవ్వి..అందులో నిక్షిప్తమై ఉన్న తెలుగు పుస్తకాలను బయటకి తీసి వాటి దుమ్ము దులిపి...ఆ సంపద నలుగురికి పంచి పెట్టినా...నలుగురికి చెప్పినా...
మిమ్మల్ని సత్కరిస్తాము...అని చెప్పాలా?
ఇటువంటివి ఏవైనా...సరే...ఇలా చేస్తే మీకు ఇదీ లాభం...అని చెప్తేనే...తెలుగు భాషను సంరక్షించుకోగలం
వినడానికి వింతగా ఉన్నా...చేదుగా ఉన్నా...ఇది నిజం/వాస్తవం..

.సూచనలు/ సలహాలు:-

1. ప్రతి చోటా..పని చేసే కార్యాలయాలు కావచ్చు...ఇల్లు కావచ్చు..ప్రతి తెలుగువాడు స్వచ్చందంగా..నెలకు ఒక రోజు...తెలుగును వెలిగించే కార్యక్రమం చేపట్టాలి

ఆరోజు...తప్పనిసరిగా...చరిత్రలో / సాహిత్యంలో/ లలిత కళల్లో/ చలన చిత్రాల్లో...ఎక్కడైనా సరే...మన తెలుగు వారు చేసిన కృషి గురించి మాట్లాడుకోవాలి..ఆ ఒక్క రోజు...చరవాణిలో సంక్షిప్త సందేశాలు, మాటలు అన్ని పూర్తిగా తెలుగులో ఉండేలా...ఎవరికి వారు స్వచ్చందంగా ఒక నిర్ణయం తీసుకోవాలి
2. ప్రతి తెలుగు పండగ..నాడు..తప్పనిసరిగా తెలుగుదనాన్ని ప్రతిబింబించేలా...వాతావరణం కల్పించాలి...ముఖ్యంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో
3.రైల్వే.స్టేషన్లు..బస్ స్టాండులు...ఆసుపత్రులు..ఇటువంటి చోట...టీవీ ల్లో...సినిమాలు సినిమా 4.పాటలు వేస్తుంటారు...వాటితో పాటుగా...తెలుగు భాషకు కృషి చేసిన మహానుభావుల గురించిన లఘు చిత్రాలను తప్పనిసరిగా ప్రసారం చేయాలి
5. పెళ్లిళ్లు/పుట్టినరోజు వేడుకలకి...మామూలుగా ఇచ్చే కానుకలతో పాటుగా..తప్పనిసరిగా ఒక తెలుగు పుస్తకాన్ని ..(అది ఎటువంటి ప్రక్రియ ది అయినా సరే...)ఇవ్వడం అలవాటుగా చేసుకోవాలి
6.ఉద్యోగార్ధులకు నిర్వహించే..మౌఖిక పరీక్ష లో...ఉద్యోగానికి సంబంధించిన అంశాలను ఆంగ్లంలో అడిగినా...ఒక 25 శాతం...మార్కులు..తెలుగులో స్వచ్చ0గా మాట్లాడినందుకు...కేటాయించాలి

తెలుగులో మాట్లాడితేనే ఉద్యోగం లేకుంటే లేదు అంటే...తప్పనిసరిగా మాట్లాడుతారు

అన్నిటికి మించి, ఇది మన కన్న తల్లి భాష అని ప్రతి..ఒక్కరికి అనిపించాలి...

ముగింపు;-

మరెన్నడూ...మన భాష ని ఎలా రక్షించుకోవాలి భగవంతుడా అని అనుకునే పరిస్థితి రాకూడదు... అని కోరుకుంటూ...శెలవు...

--అరుణ


 మన తెలుగు భాష ను పరిరక్షణ కోసం ఏమి చేయాలి :

నా అక్షరాలు కన్నీటి జల్లుల లో తడిచే దయాపరావతాలు 
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు 
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు 
తిలక్ గారి ఈ మాటలు తెలుగు కు బాగా సరిపోతాయి. 
ఈ రోజున తెలుగును పరిరక్షణ చేయాలి అని ఎందుకు అనుకొంటున్నాము? 
ప్రధాన కారణం సామాజికం గా తెలుగు వాడకం రోజు రోజుకు తగ్గుతుంది.
తెలుగు భాష అంటే కేవలం సాహిత్యం, సాహిత్య ప్రక్రియలే అనుకొంటున్న పరిస్థితులు ఉన్నాయి. భాష కు సాహిత్యం కంటే కూడ ఇతర సామాజిక భాద్యత లు కూడా ఉన్నాయి. 
భాష సామాజిక అంశం, సాహిత్యం సంస్కృతి అంశము. తెలుగు సాహిత్యం గొప్పగా అభివృద్ధి చెందినది. గిడుగు వారు, వారి సహచరుల కృషి వలెనే ప్రజల భాష కు గుర్తింపు పెరిగింది. ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాల్చిన భాద్యత మనమీద ఉంది. అందుకే మనము మరికొంత శ్రమించాలి. 
ప్రజల రోజు వారీ జీవితాంశాలు అయిన విద్య, ఆరోగ్యం, పాలన వ్యవస్థ, ప్రయాణం తదితర అంశాల లో మరి కొన్ని చర్యలు అవసరం. 
1.కళాశాల విద్య వరకు తెలుగు మాధ్యమం లోనే ఉండాలి. 
2.పట్టభద్రత ( డిగ్రీ ) విద్య లో కూడా తెలుగు మాతృభాష వారికి తెలుగు ఒక ప్రధాన విషయం గా ఉండాలి. 
3.ప్రాచీన, జానపద సాహిత్యం లోనూ, జనశృతి లోను వివిధ మాండలికం ల లో ఉన్న పదాల తో నిఘంటు నిర్మాణం జరగాలి. 
4.ఉన్నత స్టాయ్ శాస్త్ర, వైద్య, వ్యవసాయం, సాంకేతిక శాస్త్రాల మీద గ్రంధాలు తెలుగు లోకి తెచ్చి అందరికి అందుబాటులోకి తీసుకొని రావాలి. 
5.ఆరోగ్యం విషయం లో తెలుగు భాషా వినియోగం చాలా తక్కువగా ఉంది. అందుకే వెనువెంటనే మందులు చీటీలు, వైద్య విషయ పట్టిక లు ( కేసు షీట్స్ ) తెలుగు వ్రాయాలి.
6.ప్రభుత్వ ఉత్తర్వులు, రాజపత్రాలు, న్యాయస్థానాల వ్యవహారాలు, తీర్పులు సులభమైన తెలుగు లో ప్రజలకు ఇవ్వాలి. 
7.ప్రయాణ సాధనాల వివరాలు, గమ్యస్థానాల వివరాలు, మార్గమధ్యం లోని చూసిక లు తెలుగు లో కూడా ఉంచాలి. 

ఇవి కొన్ని మాత్రమే... ఇంకా ఎంతో చేయాలి.


తెలుగు ను రక్షించుకునేందుకు ఏమి చెయ్యాలి అని చెప్పేందుకు సిగ్గు పడవలసిన పరిస్థితి😔

1. మొదటగా ఇంట్లో నే మొదలుపెట్టాలి, మన పిల్లల చేత అమ్మ, నాన్న  అని ఆప్యాయంగా పిలిపించుకోవాలి.

2. ఇప్పుడు ప్రతి విద్యాలయం లో తెలుగు మొదటగా నేర్పించుటలేదు, కావున అవకాశం ఉన్నంత వరకు మనం ఇంట్లో పిల్లలకు మొదటగా తెలుగు నేర్పించే ప్రయత్నం చేయాలి.

3. మనం వాడే ఊత పదాలు కూడా ఆంగ్లమేనా( బ్రో, బాస్, మచ్ఛా, బయ్య), కనీసం అన్న లేక తమ్ముడు లేదా కనీసం తంబీ అని అయిన పిలుద్దాం.

4. డబ్బులు ఉన్నవాళ్లు చాలా మందే ఉన్నారు ఈ రోజున,  పండగలకి చందాలు అడగగలం కదా, ఇప్పుడు గ్రంధాలయం లో తెలుగు పుస్తక వితరణ కోసం చందాలు అడిగి ప్రతి గ్రంధాలయం కి తెలుగు పుస్తకాలు వచ్చే లా చేద్దాం.

5. ప్రతి ఒక్కరి దగ్గర ఆంగ్ల నిఘంటువు ఉంటుంది, తెలుగు నిఘంటువు ఎంత మంది దగ్గర ఉంది?

6. ప్రతి రోజు గుడికి వెళ్తే అక్కడ వున్నప్పుడు కనీసం ఆ శ్లోకాలు వింటే అవి నేర్చుకోవడనకైనా తెలుగు నేర్చుకుంటారేమో😔

🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*అమ్మ ప్రేమలా* *స్వచ్చమైనది* 
 *చిన్నారుల నవ్వులా* *అచ్చమైనది* 
 *అమృతం కంటే* *తీయనైనది* 
 *అందమైన మన తెలుగు* 


 *తెలుగు సాహిత్యం మన పిల్లలకు ఎలా చేరువ చేయాలి?* 

తెలుగు మన మాతృ భాష అయివుండీ , మన భాష ను మనమే కాపాడు కో వలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పట్లో మనం స్కూళ్ల పరిస్థితి ని ఎలాగో మార్చలేము. కానీ మనం మన ఇంట్లో పిల్లలకు పూర్తి స్వేచ్చను ఇవ్వాలి. అప్పుడే మన భాష ను బతికించుకో గలం. ఇప్పుడు ఉన్న తరానికి తెలుగు ఎలా రాయాలో కూడా నేర్పాల్సిన పరిస్థితి లో మనం ఉన్నామంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఒక సబ్జెక్టు గా వాళ్ళకి ఉన్నప్పటికీ ఉపాధ్యాయులకు సమయం లేక అవసరమైన పదాలను మాత్రమే వారి దగ్గర బట్టి పట్టిస్తున్నారు. మన రోజుల్లో అయితే ఎంచక్కా పాలకాబలపం పట్టుకుని ఒక్కో అక్షరం దిద్దు తూ నేర్పేవారు. ఇప్పుడు ఉన్న తరానికి కనీసం దిద్దే ఓపిక కూడా లేదు. ఉపాధ్యాయులే పుస్తకాలు మాత్రమే తెచ్చుకోండి , పలకలు వద్దు అని చెప్తుంటే ఇక పిల్లలకు ఓపిక ఎక్కడ నుంచి వస్తుంది అండి?

 *సలహాలు - సూచనలు:* 

నా వరకు అయితే తెలుగు పిల్లలకు రాదు అంటే దానికి 90 శాతం తల్లి తండ్రుల దే భాధ్యత. అవునండి మనమే రేపటి తరానికి మార్గదర్శకాలు చూపించేవారు గా ఉన్నాము. కాబట్టి పిల్లలకు తెలుగు మాట్లాడడం నేర్పండి. స్కూల్ లో పలకలు అనుమతించ నప్పుడు ఇంట్లోనే ఒక అరగంట వల్లచేత దిద్దించండి. చిన్న చిన్న పదాలను చదవడం నేర్పించండి. తరువాత కథలపుస్తకం తెచ్చి మీ పిల్ల చేత చదివించండి. ఇవన్నీ నేను నా పిల్లలకి చేశాను , మంచి ఫలితం ఇచ్చింది , అందుకే ఈ సలహా ఇవ్వగలుగుతున్నాను.

 *అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు* 🙏🙏🙏Post a Comment

0 Comments