Responsive Advertisement

భారతీయ వాఙ్మయం స్త్రీని "సామ్రాజ్ఞి" అని కీర్తించింది.....

నిత్యనూతనమైన సజీవ హైందవ సనాతనాధర్మము స్త్రీని "వంటింటి కుందేళ్ళని" చేసిందని, స్త్రీలని అడుగడుగునా పురుషాహంకార పక్షపాతధోరణితో  తొక్కేసిందని,హైందవం మీద స్త్రీల గురించి ఎన్నో విమర్శలు...కానీ భారతీయ వాఙ్మయం స్త్రీని "సామ్రాజ్ఞి" అని కీర్తించింది.....
అఖిల వేదాలకి అధిష్టాన దేవత అయిన మాత'గాయత్రి'
సకల విద్యలకి అధిదేవత ఐనా మాత సరస్వతి
శక్తి కి మాతదుర్గా,ధనానికి మాత లక్ష్మీ వీరంతా స్త్రీదేవతలే కదా.. ఇంకా గ్రామదేవతల పేరిట ఎంతో మంది స్త్రీమూర్తులని ఆరాధించే ధర్మం హిందూధర్మమే కదా....
మాత అనసూయ,ఆపాల,ఆత్రేయి, అరుంధతి,సులభ, కాత్యాయని,గార్గి వీరంతా కూడా వేదవేదంగాలను అభ్యసించినవారే కదా..
*25 సంవత్సరాల తన పాలనలో ఔరంగజేబు సేనలనెదుర్కుంటూ ఒక్కసారి కూడా ఓటమిపాలు కాని మహాన్ సామ్రాజ్ఞి.. కర్ణాటకకు చెందిన "కెలడి చెన్నమ్మ"....
*1178లో జరిగిన యుద్ధములో మహమూద్ ఘోరీ సేనలని ఓడించి తిరిగి తన రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా తరిమి తరిమికొట్టిన గుజరాత్ మహాసామ్రాజ్ఞి "నైకాదేవి"
*ప్రపంచంలొనే మొట్టమొదటి మహిళమంత్రిగా ప్రఖ్యాతి గాంచిన పలనాటికి చెందిన "నాయకురాలునాగమ్మ"
*మొఘల్ సామ్రాజ్య దురాక్రమణధారులనెదుర్కుంటూ గోండ్వాన సామ్రాజ్యాన్ని కాపాడుకున్న "రాణి దుర్గావతి"
*శివాజీ మహరాజ్ చేత "నేను తప్పు చేశాను,నన్ను క్షమించు తల్లి,నీ రాజ్యం నాకొద్దు"అనిపించుకోగలిగిన "బెల్వాడి మల్లమ్మ"
*కుతుబద్దీన్ ఐబక్ ని చిత్తు చిత్తు గా ఓడించిన చిత్తోర్-ఘర్ మహారాణి "రాణి కుర్మాదేవి"
*ఎందరో విదేశీ దండయాత్రల నుండి తన రాజ్యాన్ని కాపాడుకుంటూ దేశమంతటా ఎన్నో ఆలయాలు,ధర్మశాలలు నిర్మించిన "అమ్మ అహల్య భాయ్ హోల్కర్"
*తన స్వాభిమాన ఆత్మగౌరవాలని కాపాడుకోవాడానికి సామూహిక అగ్నిదమన ఖాండ 'జౌహర్'లో తన్ను తాను అర్పించుకున్న "రాణిపద్మిని"
*మొఘల్ సేన దాడులనేదుర్కొన్న "రాణి తారాబాయ్"
*1705 లో మొఘల్ సేనల్నెదురుకున్న "Saint of Sikh" 'మాత బాగ్-కౌర్'
*ఒంటిచేత్తో హైదర్ అలీ సేనల్ని ముప్పుతిప్పలు పెట్టిన చిత్రదుర్గ శివంగి "ఓనకే ఓబవ్వ"
*రాణి లక్ష్మీభాయ్ రూపురేఖలతో తెల్లోలకి చుక్కలు చూపించిన 'రాణి జల్కరి భాయ్'
*1857 తిరుగుబాటులో తనంతట తానే "Commander" గా మారి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటీషర్ల మీదకి దండెత్తిన వీరనారి"ఉదాదేవి"
*16వ శతాబ్దంలో పోర్చుగీసులని ఎదిరించిన "అబ్బక్క చౌతా"
*'She is symbol of Independent'అని పేరుగాంచిన "కిట్టుర్ చెన్నమ్మ"
*రాణి లక్ష్మీభాయ్ కంటే ముందుగానే బ్రిటీషర్ల మీదకి దండెత్తిన శివగంగ శివంగి "రాణి వేలు నచియార్"
*మాత రుద్రమ,మాత లక్ష్మీభాయ్ ల గురించి ఏం చెప్పగలం....
మహారాణి అనసూయ,భోదీసిరికా ఉపసిరిక,రాణి చిమ్మభాయ్,మహారాణి గాయాత్రిదేవి, పుత్రులకి మార్గనిర్దేశం చేసిన మాతగౌతమీబాలశ్రీ,మాత జిజియాభాయ్ ఇంకా  కాలగర్భములో కలసిపోయిన అనేకమంది వీరనారిమణులైన స్త్రీమూర్తుల గురించి ఏం చెప్పగలము....
ఏం వీరంతా స్త్రీలు కాదా..!!! వీరు రాజ్యాలు చేయలేదా...చేసారు, తమ మీదకొస్తే ఒకటి చంపారు లేదా చచ్చారు కానీ వెన్ను చూపలేదే...వీళ్లందరిని హిందూ ధర్మం తొక్కిందా???మీరు స్త్రీలు, రాజ్యం చేయొద్దని చెప్పిందా..!!! హిందూ ధర్మములో ఎన్నడూ నిష్క్రియా పర్వం లేదు....
వివాహ సందర్భములో వరుడు వధువుని ఉద్దేశించి 'శిబికే శిర ఆరోహ'అంటాడు..అంటే భార్యను నెత్తిన ఎక్కి కూర్చోమని చెప్పడం..గృహస్థాశ్రమంలో భార్య,పిల్లలు తిన్నతరువాతే ఇంటి యజమాని తినాలి అని ధర్మశాస్త్రం..భార్య అనుమతి లేనిదే భర్త యే పని చేయరాదని 'యజ్ఞవల్క్య స్మృతి' చెప్తుంది. భార్య కోరితే అన్ని వ్రతాలు,నియమాలు మాని ఆమెకు సంతానాన్ని ఇవ్వాలి.ఇవన్నీ పురుషాహంకారలా..!!!
స్త్రీల మీద గౌరవంతో "భరతమాత" అంటాము కదా మా దేశాన్ని...మీకు చేతకాక,చేవలేక మతాహంకారంతో,జాత్యహంకారంతో అధికారదర్పం తో సనాథనాధర్మము మీద దుష్ప్రచారం చేస్తూ ఎం సాధించారు మీరు...మొఘల్స్ గొప్పవారా..!!! బ్రిటిషర్స్ గొప్పవారా...!!ఎంతో మంది స్త్రీలపై దండెత్తిన  వీరేం గొప్ప,వారిని కూడా ఉరికించి ఉరికించి తరిమికొట్టారు కదా ఈ స్త్రీమూర్తులు గొప్ప......ఈ దేశం కోసం పోరాటం చేసిన ప్రతి స్త్రీ మూర్తి పాదాలకి శతసహస్ర కోటి వందనాలు......
🙏🙏🙏🙏🙏🙏🙏

Post a Comment

0 Comments