కథ - మనిషిని చూసి మనసును లెక్కించ రాదు

కథ - మనిషిని చూసి మనసును లెక్కించ రాదు

SHYAMPRASAD +91 8099099083
0
*మనిషిని చూసి మనసును లెక్కించ రాదు*

ఒక రోజు అక్బర్ మహారాజు తన సభలో, “మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు” అని అన్నారు.

అది బీర్బల్ ఒప్పుకో లేదు. మనిషి వృత్తికీ స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు.

అక్బర్ కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివి తేటలు, మేధస్సు మీద చాలా నమక్కం. కాని, అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా.

అందుకనే మనిషి వృత్తి కి, స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే, అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు.

“సరే, రేపు ఇద్దరం మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేద్దాము, ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చోపిస్తాను!” అని బీర్బల్ ఒప్పుకున్నాడు.

అనుకున్న ప్రకారం మొన్నాడు ఇద్దరూ మారు వేషం వేసుకుని నగర పర్యాటన చేసారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు.

బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి, మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గిరకి వెళ్లి, “మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టు లోంచి ఏమైనా ఇప్పించండి!” అని నాటకం ఆడాడు.

మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు  చీదరించుకుని, “ఛీ! ఛీ! వ్యాపారం  చేసుకునే ఈ సమయం లో ఈ గోలేంటి! నిన్ను చూసి కొనే వాళ్ళు కూడా రారు! పొ! పొ!” అని చికాకుగా ధుత్కరించాడు.

బీర్బల్ ఊరుకో కొండా, చాలా ఆకలి వేస్తోంది అని బ్రతిమాలాడు.

మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుభండారాలు పెట్టుకుని కూడా ఏ మాత్రం చలించలేదు. సహాయకుల చేత బీర్బల్ ని మెడ బెట్టి కొట్టు బయటకు గెంటించాడు.

బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడ నుంచి వెళ్లి పోయాడు.

ఒక బండలు కొట్టే మేస్త్రీ కనిపించాడు.

అలాగే మారు వేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గిరకు వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు.

“అయ్యా! మేము పోరుగూరినుంచి వస్తున్నా బాటసారులము. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచం సహాయం చేస్తారా?” అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు.

ఆ మేస్త్రి వెంటనే, “అయ్యో! అలాగా! నాతొ రండి.” అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి, ఇంట్లోకి తీసుకుని వెళ్లి, ఉన్న కొంచంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించ మన్నాడు.

అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు, తయారు చేసి, రుచికరమైన భోజనం వడ్డించింది.

భోజనం అయ్యాక, కొంచం సేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్, బీర్బల్ కి విసినికర్రలు ఇచ్చాడు.

ఇలా మర్యాదగా అతిథులు లాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్, బీర్బల్ సెలవు తీసుకుంటుంటే, దారిలో తినడానికి కొంత తిను భండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు.

తిరిగి సభకు చేరాకా, బీర్బల్ అక్బర్తో, “ప్రభు! చూసారా! మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు, అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి కఠిన హృదయము లేదు! మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా?” అని అడిగాడు.

అక్బర్ చిరు నవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు.

ఆపదలో వున్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి, కృతజ్ఞత తెలియ చేసుకున్నారు.

అందుకే పెద్దలు చెబుతారు పూలు అమ్మే వారికి 
కష్టాలు లేవని, అలాగే 
ఐశ్వర్యం ఉన్న వారందరు
సంతోషంగా ఉంటారు 
 అనుకోవడం చాలా పొరపాటు. ఏందకంటే డబ్బు సౌకర్యాలను ఇస్తుంది కానీ సంతోషాన్ని ఇవ్వలేదు.

మనిషిని చూసి మనసును లెక్కించ రాదు ఎందుకంటే 
గాలిని మనం చూడలేం అంతమాత్రాన గాలి లేదు అని నిర్ధారించడం వీలుకాదు.
అలాగే మనం చేసే పాప పుణ్యాల లెక్క ఒకటి ఉంటుంది. మనకు కనిపించనంత మాత్రాన దేవుడు లేడు అనుకోవడం మూర్ఖత్వం.

నా చుట్టూ ఉన్న వారు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉంటాను అని అనుకోకూడదు.
మార్పు మనతోనే మొదలు కావాలి.

నువ్వు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు... కానీ.. నిన్ను చూసి మరో పదిమంది  వెలిగిస్తే చీకటి సైతం కంటికి కనిపించదు.
అలాగే మనం మంచి దారిలో నడిస్తే మనల్ని చూసి మరో పది మంది మంచి దారిలో నడుస్తారు. ఇలా లోకం అంత మారితే మళ్లీ మనం సత్య యుగాన్ని చూడవచ్చును.
🌹 *సేకరణ* 🌹

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!