కథ - అపాత్ర దానం ఎంత తప్పో, కొడుకులు తండ్రుల పేరిట చేసే పుణ్య కార్యాల ఫలితం ఎట్లా ఉంటుందో తెలిపే చిన్న పురాణ కథ.

కథ - అపాత్ర దానం ఎంత తప్పో, కొడుకులు తండ్రుల పేరిట చేసే పుణ్య కార్యాల ఫలితం ఎట్లా ఉంటుందో తెలిపే చిన్న పురాణ కథ.

SHYAMPRASAD +91 8099099083
0
🍁🍁🍁🍁

అపాత్ర దానం ఎంత తప్పో, కొడుకులు తండ్రుల పేరిట చేసే పుణ్య కార్యాల ఫలితం ఎట్లా ఉంటుందో తెలిపే చిన్న పురాణ కథ.



పాండవుల వారసుడైన జనమేజయుడికి శతానీకుడు అనే కొడుకు ఉండేవాడు. 

ఎన్నో యుద్దాలు చేసి గెలిచి అపారమైన ధనం కూడ బెట్టాడు. ఆ డబ్బుతో అంతు లేనన్ని దానాలు చేసి దానం పుచ్చుకున్న బ్రాహ్మణుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు.
అందరూ తెగ పొగిడేవారు.

ఆయన మరణానంతరం ఆయన కొడుకైన సహస్రానీకుడు రాజ్యానికి వస్తాడు. ఆయన కూడా ఎంతో పరాక్రమవంతుడే కాని ఎవ్వరి మీద దండయాత్ర చేయ లేదు. అట్లాగే అతిగా దానాలూ చేయలేదు. దాంతో ఆ బ్రాహ్మణులు అసంతృప్తి చెంది తిరిగి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించమని వేడుకుంటారు.
 
"మా తండ్రిగారికి అది మేలు కలిగించి ఉంటే నేను కూడా అదే విధంగా చేస్తాను. కాని ఆ పని వల్ల మా తండ్రిగారికి ఏ విధమైన ఫలితం దక్కిందో ముందుగా తెలుసు కోవాలి." అని భార్గవ మహర్షిని కోరుతాడు.

భార్గవుడు సమాధిలోకి వెళ్ళిపోయి ఆత్మ శరీరంతో శతానీకుణ్ణి వెతుక్కుంటూ స్వర్గానికి వెళ్తాడు. కాని అక్కడ శతానీకుడు కనిపించడు. అక్కడ నుండి భార్గవుడు నరకానికి వెళ్తాడు. అక్కడ శతానీకుడు కనబడటమే కాక,
"నేను చేసిన పాపాలలో మొదటిది అందరినీ కొల్లగొట్టి ధనం సంపాదించటం, రెండవది. అక్రమంగా సంపాదించింది సుఖాలలో ఓలలాడుతున్న బ్రాహ్మలకు దానం ఇవ్వటం. ఆ కారణాల వల్లే నరకం పాలయ్యాను." అని వివరిస్తాడు.

భార్గవుడు ఈ విషయం సహస్రానీకుడికి వివరిస్తాడు.

 న్యాయంగా సంపాదించిన ధనాన్ని మాత్రమే దానం చేస్తేగాని తండ్రికి పుణ్యగతులు లభించవు అంటాడు.

మర్రోజే సహస్రానికుడు దేశాంతరం పోయి శ్రామికుడిగా జీవిస్తూ ఒక ఏడాది పాటు సంపాదించిన ధనంతో రాజ్యానికి తిరిగి చేరుకుంటాడు.


బ్రాహ్మణులను పిలిచి ఆ ధనం దానం ఇస్తూ, "ఈ దానం చాలా అల్పమైనది. కాని న్యాయంగా సంపాదించింది. దీన్ని స్వీకరించి నా తండ్రికి పుణ్యగతులు కలిగేలా ఆశీర్వదించండి." అని వేడుకుంటాడు.

తరువాత ఖజానా తెరిపించి తండ్రి అక్రమంగా సంపాదించినదంతా నిరుపేదలకూ అనాథలకూ పంచెపెడతాడు. 

మళ్ళీ భార్గవుడిని తండ్రి పరిస్థితి విచారించమని వేడుకుంటాడు.

భార్గవుడు మళ్ళీ నరకానికి వెళ్ళి శతానీకుడు పాపాల నుండి విముక్తి పొంది బంగారు రథంలో స్వర్గానికి వెళ్ళటం చూసి సంతోషించి సహస్రానీకుడికి వివరిస్తాడు.

పాపిష్టి ధనం ఎంత దానమిచ్చినా ఫలితం ఏ మాత్రమూ ఉండదు అని ఈ చిన్న కథ వివరిస్తుంది.

                     🍁🍁🍁🍁

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!