Awesome Story
జమీందారు గారికి ఎవరో మంచి అందమైన పక్షిని నజరానాగా ఇచ్చారు.
ఆయన దాన్ని అల్లారు ముద్దుగా చూసుకున్నారు.
మంచి తిండిని, అన్ని వసతులన్ని కల్పించాడు.
ఒక్కటే చింత...
ఆ పక్షి ఎగరడం లేదు.
ఒక కొమ్మ మీద కూర్చుని ఉంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎగరడం లేదు.
ఎంతో మంది వైద్యులు చూశారు. చికిత్సలు చేశారు.కానీ ఫలితం లేదు.
చివరికి ఒక రైతు వచ్చాడు.
ఒక పదిహేను నిమిషాల తరువాత
ఆ పక్షి ఎగురుతూ కనిపించింది.
జమీందారు గారు ఆశ్చర్యపోయారు.
"ఏం మాయ చేశావు?" అని అడిగాడు.
"అది కూర్చున్న కొమ్మల్ని ఒక్కొక్కటిగా నరికేశాను. దాంతో దానికి ఎగరక తప్పలేదు.
*అన్నీ కూర్చున్న చోటే అమరితే ఎవరు మాత్రం ఎదుగుతారు?" అన్నాడు రైతు.*
*నేటి తరం పిల్లల పెంపకం ఇలాగె వుంది*
Hi Please, Do not Spam in Comments