కథ - ఎవరు పొరుగువాడు?

కథ - ఎవరు పొరుగువాడు?

SHYAMPRASAD +91 8099099083
0
🍁ఎవరు పొరుగువాడు?🍁

ఒకసారి ఒక స్వామీజి వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అడిగాడు, ‘‘అయ్యా! నేను స్వర్గానికి వెళ్ళాలంటే, శాశ్వతమైన జీవాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి?’’

‘‘గ్రంథాలలో రాసి ఉన్నదేమిటి? నువ్వేం అనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించారు ఆ స్వామీజి.

‘‘పూర్తి హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, మొత్తం శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మనల్ని ప్రేమించుకున్నట్టే మన పొరుగువారిని కూడా ప్రేమించాలి’’ అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. 

‘‘అవును. ఆ పని చెయ్యి! నువ్వు స్వర్గంలో శాశ్వతంగా జీవిస్తావు’’ అన్నారు స్వామీజి. 

‘‘మరి నా పొరుగువారంటే ఎవరు? అని అడిగాడు ఆ వ్యక్తి.

స్వామీజి చిరునవ్వు నవ్వుతూ, ‘‘ఒక కథ చెబుతాను విను. ఒక బ్రాహ్మణుడు రోడ్డు మీద నడిచి పోతున్నాడు. అతను రామేశ్వరం నుంచి కాశీ వైపు వెళుతున్నాడు. నడిచి వెళితే కొన్ని రోజుల ప్రయాణం. ఆ రహదారి రాళ్ళతో, చిన్న గుట్టలతో నిండి ఉంది. 

అతను భజనలు చేసుకుంటూ నడుస్తూ ఉండగా, ఒక గుట్ట వెనుక నుంచి కొందరు దొంగలు అతని మీదకు వచ్చి పడ్డారు. అతని వస్తువులన్నీ లాక్కున్నారు. దుస్తులు చించేశారు. తమ వెంట వచ్చి, జాడలు కనిపెడతాడేమోనని అతణ్ణి చితక్కొట్టారు. ఆ బ్రాహ్మణుడు రోడ్డు పక్కన నెత్తురోడుతూ పడి ఉన్నాడు.

🔻కొన్ని నిమిషాల తరువాత, దైవకార్యాలు చేసే యాజకుడొకరు అదే దారిలో వచ్చాడు. ఆ బ్రాహ్మణున్ని  చూశాడు. తల తిప్పుకొని, ఏదీ చూడనట్టుగా ముందుకు సాగిపోయాడు. 

🔻మరో గంట తరువాత, యాజకులకు దైవకార్యాల్లో సహకరించే మరొక వ్యక్తి ఆ వైపు వచ్చి, బ్రాహ్మణున్ని చూసి, ఏ సాయమూ చెయ్యకుండా వెళ్ళిపోయాడు. 

కొంతసేపటి తరువాత ఒక చాకలి ఆ వైపు వచ్చాడు. ఆ కాలంలో బ్రాహ్మణులకు ఇతర కులాల వారంటే చిన్న చూపు ఉండేది. 

👉కానీ రోడ్డు పక్కన పడి ఉన్న బ్రాహ్మణున్ని గమనించగానే, ఆ చాకలివాడు అతని దగ్గరకు వెళ్ళాడు. గాయాలకు మందు రాసి, కట్లు కట్టాడు. తన గాడిద మీద ఎక్కించుకున్నాడు. అతణ్ణి ఒక సత్రంలో చేర్చాడు. మర్నాడు ఆ చాకలివాడు మళ్ళీ తిరిగి వచ్చి, సత్రం నడిపే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు కోలుకొనే వరకూ జాగ్రత్తగా చూసుకోవాలనీ, అవసరమైతే మరికొంత డబ్బు ఇచ్చి వెళతాననీ చెప్పాడు. ఇదీ కథ.’’

🌿కథ ముగించిన స్వామీజి ఆ వ్యక్తిని అడిగాడు - ‘‘దొంగల చేతుల్లో దెబ్బలు తిని, గాయపడిన బ్రాహ్మణునికి ఆ ముగ్గురు వ్యక్తులలో పొరుగువాడు ఎవరు?’’‘‘అతని పట్ల జాలిపడి, సాయం చేసినవాడే!’’ అని చెప్పాడు ఆ వ్యక్తి.

👉‘‘వెళ్ళు! నువ్వూ అదే విధంగా సాయం చెయ్యి’’ అన్నాడు స్వామీజి.🍁

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!