కథ - బంగారం తయారీ

కథ - బంగారం తయారీ

SHYAMPRASAD +91 8099099083
0
🏵 బంగారం తయారీ 🏵

అనగనగా ఒక ఊళ్లో... ఓ అందమైన యువకుడు. అతనికి కొత్తగా పెళ్లయింది. అబ్బాయి మంచివాడే కాని అతనితో ఒక్కటే సమస్య. పగలూ, రాత్రి అతడు పరుస వేది( బంగారం తయారీ ) ప్రయోగాలు చేస్తూ గడిపేస్తున్నాడు. 

అతని భార్య కలవరపడిపోయింది. ఇల్లు గడవడమే కష్టమయిపోతోంది. ఉద్యోగం చేయమంటే వద్దంటున్నాడు. బంగారాన్ని సృష్టించి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని అయిపోతానంటున్నాడు.
అమ్మాయి వెళ్లి తన తండ్రి దగ్గర గోల పెట్టింది. మీ అల్లుడుగారిని మార్చండి అంటూ ప్రాథేయపడింది.

 అప్పుడు మామగారు అల్లుడి దగ్గరకు వెళ్లారు. కాని ఆయన మందలించలేదు.
 ‘‘బాబూ... నిన్ను చూస్తే ముచ్చటగా ఉందయ్యా... చిన్నతనంలో నేను కూడా పరుసవేది ప్రయోగాలు చేశాను. బంగారాన్ని తయారు చేసే ఫార్ములా కనుక్కున్నాను. అది నీకు చెప్పాలని ఉంది...’’ అన్నారు.

 అబ్బాయి మొహం వికసించింది. చెప్పండన్నాడు ఆత్రుతగా.

‘‘అరటిపండ్ల మీద ఏర్పడే తెల్లని ధూళి ఉంటేగాని నీ ప్రయోగం ఫలించదు... కాని అందుకు రెండు టన్నుల ధూళి కావాలి..’’ చెప్పాడు మామగారు.

 అబ్బాయి ఆలోచించలేదు. వెంటనే పొలంలో అరటి తోట వేశాడు. తనే దగ్గరుండి తోటను చూసుకున్నాడు. చక్కని పంట పండించాడు. ధూళితో మామగారి దగ్గరకు వెళ్ళాడు.

‘‘ఇది అవసరం లేదయ్యా... నువ్వు ఇప్పటికే బంగారాన్ని సాధించావు’’ అన్నాడు చల్లగా.
అబ్బాయి ఆశ్చర్యపోయేలోపే... పక్కనుంచి అమ్మాయి వచ్చింది. ఆమె రెండు సంచుల నిండా బంగారం కాసుల్ని అతని ముందు బోర్లించింది.

 అప్పుడు మామగారు చెప్పారు...
‘‘నువ్వు శ్రమపడి పండించిన అరటిపండ్లను అమ్మాయి అమ్మి ఇంత సొమ్ము సంపాదించింది. ఇదేనయ్యా... పరుసవేది...’’ అన్నారు. అబ్బాయికి జ్ఞానోదయం అయింది...

డబ్బు  / సంపద అంటే ఒక ఆలోచన 
డబ్బు అంటే. ..కృషి. ..పట్టుదల 

money is not a product. ..
money is a byproduct. ..

ఇందులో నీతి ఏమంటే. ...

మనం ఏదైనా ఒక పని చేస్తేనే సంపద వస్తుంది. ..
పగటి కలలు కంటూ కూచుంటే రాదు అని. ..
డబ్బు వస్తుంది. ..పోతుంది. ..
కానీ. ..డబ్బు ఏం చేస్తుంది అనేది 
తెలుసుకోండి. ..

సంపద గురించిన మర్మమంతా ఆ తెలుసుకోవడంలోనే ఉంది.....

సేకరణ.....

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!