కనపడుట లేదు - మాయమై పోతున్న తెలుగు అమ్మాయి | Missing - Telugu girl disappearing - A to Z 2512

HIGHLIGHTS

కనపడుట లేదు - మాయమై పోతున్న తెలుగు అమ్మాయి | Missing - Telugu girl disappearing

 🌸           కనపడుట లేదు           🌸


మాయమై పోతున్న తెలుగు అమ్మాయి.


ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగు అమ్మాయిని చూసారా? చూస్తే చెప్పండి. అయ్యా! మీకు పుణ్యం ఉంటుంది.


ఓహో! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదుకదూ! ఆనవాలు చెపుతా, వినండీ.


✔️ మా అమ్మాయి అమాయకంగా ఉంటుంది.


✔️ చేతినిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగ ఉంటుంది.


✔️ రెండు చేతులకూ గోరింటతో (మెహెంది కాదు), పాదములకు పారాణితో అందంగా ఉంటుంది.


✔️ మా అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని ఓణి వేసుకుని ఉంటుంది.


✔️ తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి రొండు జడలు వేసుకుంటుంది.


✔️ తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుంటుంది.


✔️ చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన పావళా కాసంత చంద్రబింబం లాంటి ఎఱ్ఱటి కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు).


✔️ కాళ్లకు మువ్వల అందెలతో (కాలి పట్టీలు అనకూడదు) ఘల్లుఘల్లు మంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది.


✔️ ముద్దబంతి పువ్వులా, చిదిమి దీపము పెట్టుకునే లాగున, ఇంటికి కళగా ఉంటుంది.


🌸 ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? అగుపించినదా? మాకైతే గత పాతిక సంవత్సారాలుగా కనిపించడం లేదు. పండక్కో, పబ్బానికో, అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమైపోద్ది అంతే !!!


😢

..........


దానికి నేను రాసిన సమాధానం ఇది 👇


ఆమె ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగబ్బాయిని వెతుకుతూ వెళ్ళి, ఇంతవరకూ రాలేదు. 

తెలుగబ్బాయి ఎవరా అనా?

ఆనవాళ్ళు చెపుతాను. 


✔️ ధైర్యంగా ముందుకు పోయే తత్వం.


✔️ ఠీవిగా, పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు. 


✔️ నడిచొచ్చే విష్ణుమూర్తిలా ఉంటాడు. 


✔️ కోరమీసంతో, కోటేరు ముక్కుతో ఉంటాడు. 


✔️ అందరినీ వరసలు కలిపి, నవ్వుతూ పలకరిస్తుంటాడు.


✔️ తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు. 


✔️ చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు.


✔️ తల్లిదండ్రులను అమ్మా నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా,  బాబాయ్ లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు. అనవసరంగా మ్లేచ్ఛభాష వాడడు. 


✔️ అడగకుండానే తోటివారికి తోచిన విధంగా సాయం చేస్తుంటాడు.


✔️ చూడటానికి రెండు కళ్ళూ, చెప్పటానికి మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు. 


✔️ చూసి చాలా కాలమైంది. తననే వెతుకుతూ వెళ్ళి ఉంటుంది తెలుగమ్మాయి. ఒక్కటి మాత్రం నిజం. వస్తే ఎప్పటికైనా వీళ్ళు కలిసే వస్తారు. రావాలనే ఆశిద్దాం.



1 comment: