Some traditions that everyone should know | అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని సంప్రదాయాలు
1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం చేసుకోరాదు
2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు.
3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు క్షవరం చేసుకోరాదు.
4) భోజనం తిన్న పళ్లెంలో చేయి కడగకూడదు.
5) నూనె, ఉప్పు, గుడ్లు చేతికి ఇవ్వరాదు.
6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.
7) సాయంత్రం గం.5 తర్వాత ఇల్లు ఊడ్చ కూడదు.
8) మంచం మీద కూర్చుని తినకూడదు.
9) తలుపుల మీద బట్టలు వేయకూడదు.
10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి. వీధి తలుపు మాత్రం తీసి ఉంచాలి.
11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి.
12) మంగళ, శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు.
13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు.
14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి.
15) తెల్లవారి లేవగానే ముందు దేవుని పటములు కానీ మీ రెండు అరచేతులు గాని చూడాలి. అద్దంలో మీ ముఖం చూసుకోరాదు.
16) అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి.
17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు.
18) ప్రతినెలా కొత్త రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద దేవుడికి నైవేద్యంగా పెట్టండి.
19) పూజా మందిరంలో మరణించిన మన కుటుంబీకుల ఫోటోలు ఉంచకూడదు.
20) ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు.
21) దేవాలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే కాళ్ళు కడుగుకోకూడదు.
22) తూర్పు, పడమటి దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు.
23) ఆడవాళ్లు శిరోజాల విరబోసుకోరదు.
24) ఆదివారం అన్నదమ్ములు ఉన్న అక్కచెల్లులు తలస్నానం చేయరాదు.
25) ముతైదువులు పంచ మంగల్యాలు (బొట్టు, గాజులు, నల్లపూసలు, కాలి మెట్టెలు ,పువ్వులు) ధరించవలెను.
26) దానం చేసేటప్పుడు కుడి చేత్తో చెయ్యవలను.
27) సంధ్య సమయంలో పడుకోకూడదు.
Hi Please, Do not Spam in Comments