మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి... | The minister must have intellect and the pawn must have devotion

 🌺

మంత్రికి 

   తెలివుండాలి, 

      

బంటుకి 

       భక్తుండాలి...


🌺

గుర్రానికి 

       వేగముండాలి


ఏనుగుకి 

        బలముండాలి...


🌺

సేనాధిపతికి 

     వ్యూహముండాలి,


సైనికుడికి 

           తెగింపుండాలి...


🌺

యుద్ధం నెగ్గాలంటే, 

   వీళ్ళందరి వెనుక 

      కసి వున్న ఒక రాజుండాలి!


🌺

మనందరిలో ఒక రాజుంటాడు...


కానీ మనమే, 

రాజులా ఆలోచించడం

            ఎప్పుడో ఆపేశాం!


🌺

మన కసి -

అడవులని చీల్చయినా సరే,

సముద్రాలని కోసయినా సరే,

    కొత్త దారులు కనుక్కోగలదు

 

         🌺 అని మనకి తెలుసు. 


🌺

అయినా, 

భయానికి బానిసయ్యాం.

      ఓటమికి తలొంచేసాం !


🌺

చరిత్రలో, 

చాలా మంది రాజులు...


 🌺ఓడిపోయారు,

    🌺 పరిపోయారు,

       🌺 ....దాక్కున్నారు, 

         🌺 దసోహమయ్యారు. 


🌺

కానీ కొందరే, 

అన్నీ పోగొట్టుకున్నా

కసితో మళ్ళీ తిరిగొచ్చి 

             యుద్ధం చేశారు.


🌺

'రాజంటే స్థానం కాదు, 

  రాజంటే స్థాయి' అని

                నిరూపించారు.


🌺

డబ్బొచ్చినా పోయినా

       వ్యక్తిత్వం కోల్పోకు...


రాజ్యాలున్నా చేజారినా

         రాజసం కోల్పోకు...


🌺

రాజంటే 

కిరీటం కోట పరివారం కాదు,


     🌺 రజంటే 

               ధైర్యం... 


             🌺 రజంటే 

                        ధర్మం...


                      🌺 రజంటే 

                             యుద్ధం...!


🌺

ఒకరోజు 

విందుభోజనం చేస్తావు,


ఇంకోరోజు 

అడుక్కుతింటావు

          - పాండవుల్లా...!


🌺

ఒక రాత్రి 

బంగారు దుప్పటి

           కప్పుకుంటావు,


మరో రాత్రి 

చలికి వణికిపోతావు

           - శ్రీరాముడిలా...!


🌺

ఎత్తు నుండి నేర్చుకో, 

  లోతు నుండి నేర్చుకో...


రెండింటి నుండి 

   ఎంతో కొంత తీసుకో...!


🌺

రాజంటే 

  స్టానం కాదు


రాజంటే 

         స్థాయి...


🌺

స్థానం - భౌతికం,

     కళ్ళకు కనపడుతుంది.

స్థాయి - మానసికం, 

     మనసుకు తెలుస్తుంది...!


🌺

మనందరిలో 

ఒక రాజుంటాడు...


బ్రతికిస్తావో,

చంపేసుకుంటావో నీ ఇష్టం!

Post a Comment

0 Comments