మన తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఉండడం లోని అంతరార్ధం ఏమిటి....? | What is the meaning of our Telugu years being only 60 ....?

మన తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఉండడం లోని అంతరార్ధం ఏమిటి....? | What is the meaning of our Telugu years being only 60 ....?

SHYAMPRASAD +91 8099099083
0

 మన తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఉండడం లోని అంతరార్ధం ఏమిటి....?


మన తెలుగు సంవత్సరాలు ప్రభవ తో మొదలు అయి అక్షయ తో అంతమయి మరల ప్రభవ తో మొదలవుతుంది (

1. ప్రభవ, 

2. విభవ, 

3. శుక్ల, 

4. ప్రమోదూత, 

5. ప్రజోత్పత్తి, 

6. ఆంగీరస, 

7. శ్రీముఖ, 

8. భవ, 

9. యువ, 

10. ధాత, 

11. ఈశ్వర, 

12. బహుధాన్య, 

13. ప్రమాథి, 

14. విక్రయ, 

15. వృక్ష, 

16. చిత్రభాను, 

17. స్వభాను, 

18. తారణ, 

19. పార్థివ, 

20. వ్యయ, 

21. సర్వజిత్, 

22. సర్వధారి, 

23. విరోధి, 

24. వికృతి, 

25. ఖర, 

26. నందన, 

27. విజయ, 

28. జయ, 

29. మన్మథ, 

30. దుర్ముఖి, 

31. హేవలంభి, 

32. విలంబి, 

33. వికారి, 

34. శార్వరి, 

35. ప్లవ, 

36. శుభకృత్, 

37. శోభకృత్, 

38. క్రోధి, 

39. విశ్వావసు, 

40. పరాభవ, 

41. ప్లవంగ, 

42. కీలక, 

43. సౌమ్య, 

44. సాధారణ, 

45. విరోధికృత్, 

46. పరీధావి, 

47. ప్రమాదీచ, 

48. ఆనంద, 

49. రాక్షస, 

50. నల, 

51. పింగళ, 

52. కాళయుక్త, 

53. సిద్ధార్థి, 

54. రౌద్రి, 

55. దుర్మతి, 

56. దుందుబి, 

57. రుధిరోద్గారి, 

58. రక్తాక్షి, 

59. క్రోధన, 

60. అక్షయ.) 


ఈ విధంగా మొదలు అవడం వెనుక రక రకాల కధలు ప్రచారం లో వున్నాయి.... అయితే హేతు బద్ధం గా ఆలోచిస్తే....

అరవై సంవత్సరాలకొకసారి మనో ధర్మాలతో పాటుగా మానవ ధర్మాలు మార్పు చెందుతూ వుంటాయి. బుద్ది శక్తి కూడా మనకు అరవై సంవత్సరాల వరకు మాత్రమే చురుగ్గా వుంటుంది. అరవై తరువాత క్రమం గా జ్ఞాపక శక్తి క్షీణించి పోతుంది. శరీరం లోని అవయవాలు అలసట చెంది శరీరం పని మందగిస్తుంది. 

అరవై సంవత్సరాల లోపల మృత్యువు ఒకసారి తన ప్రభావం చూపిస్తుందట. అంటే ఏదో రకం గా ప్రాణ గండం దగ్గరగా వచ్చి పోతుందన్నమాట!. అరవై తరువాత ప్రతి 10 సంవత్సరాలకు ఒక సారి మృత్యువు ఒకసారి పలకరించి పోతూ వుంటుంది అని చెబుతారు. 

అందుకే అరవై సంవత్సరాలకు షష్టి పూర్తి చేస్తారు. 

ప్రభవ 'నామ' సంవత్సరం తో ప్రారంభమై 'అక్షయ నామ' సంవత్సరం తో అరవై సంవత్సరాలు ముగిసి మరల 'ప్రభవ' ప్రారంభమై నట్లుగానే మనిషి కి 60 పూర్తి అయిన తరువాత 'బాల్యావస్థ' మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ వుంటారు... అకారణం గా అలగడం, అవీ ఇవీ తినాలని అడగడం.. చిరుతిళ్ళ కోసం చిరు దొంగతనాలు చేయడం చిన్న పిల్లల లాగ... ఎక్కువ సేపు నిదుర పోవడం, చిన్న విషయాలకే ఆనంద పడడం, కోపం తెచ్చు కోవడం.... ఈ విధం గా పిల్లలు ఎలా చేస్తారో అలాగే పెద్దలు కూడా చేస్తారు అని చెబుతుంటారు..

అరవై తరువాత తన బిడ్డకు తనే బిడ్డ అయి పోతారు తల్లి దండ్రులు. 

అందుకే అరవై సంవత్సరాలు నిండిన తల్లి దండ్రులను తన బిడ్డల తో సమానం గా చూసుకోవాలని చెబుతుంది ధర్మ శాస్త్రం. 

ఆరు పదుల జీవితాన్ని ఎవరైతే ఆనందం గా గడుపుతారో వారి జీవితం ధన్యమనే చెప్పా వచ్చు. ఆ ధన్య జీవితపు జ్ఞాపకార్ధమే... బిడ్డలు, మనవళ్ళు, బంధు మిత్రులు కలసి షష్టి పూర్తి ఉత్సవం గా పండగ లా చేయడం... మన తెలుగు సంవత్సారాలు అరవై వరకు మాత్రమే వుండడం లో అంతరార్ధ మిదే. 

వార్ధక్యం లో స్త్రీ వ్యామోహం , అధికార దాహం వదలి వేయాలి. కుటుంబ భాద్యతను కొడుక్కి అప్పగించాలి. మంత్రి గా మాత్రమె సలహాలు ఇవ్వాలి. మనస్సు ను దైవ కార్యాల వైపు మళ్ళించాలి. తీర్ధ యాత్రలు చేయాలి. చాతనయినంతలో దాన ధర్మాలు చేయాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!