ఐక్యరాజ్యసమితి | United Nations

*ఐక్యరాజ్యసమితి*


_యునైటెడ్‌ నేషన్స్‌ (ఐక్యరాజ్యసమితి-యూఎన్‌) అనే పదాన్ని 1942లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్ట్‌ సూచించాడు._ 


_1945 ఏప్రిల్‌ 25 నుంచి జూన్‌ 26 వరకు శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై యూఎన్‌ చార్టర్‌ను రూపొందించాయి. చార్టర్‌పై 50 దేశాలు 1945, జూన్‌ 26న సంతకాలు చేశాయి._ 


_శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనని పోలాండ్‌ చార్టర్‌పై సంతకం చేసి 51వ సభ్యదేశంగా అవతరించింది._ 


_మొత్తం 193 సభ్యదేశాలుండగా 190వ సభ్యదేశంగా స్విట్జర్లాండ్‌, 191వ సభ్యదేశంగా తూర్పు తిమోర్‌ చేరాయి._ 


_2006, జూన్‌ 3న సెర్బియా నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన మాంటెనీగ్రో 2006 జూన్‌ 28న ఐక్యరాజ్యసమితిలో 192వ సభ్య దేశంగా చేరింది._ 


_193వ దేశంగా దక్షిణ సూడాన్‌ (రిపబ్లిక్‌ ఆఫ్‌ సౌత్‌ సూడాన్‌) ఐక్యరాజ్యసమితిలో 2011 జూలై 14న చేరింది._ 


_తైవాన్‌, వాటికన్‌ సిటీ, లీచ్‌టెన్స్‌ టెన్‌లకు సమితిలో సభ్యత్వం లేదు. ఐక్యరాజ్యసమితి 1945, అక్టోబర్‌ 24 నుంచి అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది._ 


_ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటాం._ 


_ఐక్యరాజ్యసమితికి, దాని అప్పటి అధ్యక్షుడు కోఫీ అన్నన్‌కు 2001లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది._


*⇒ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్‌ చార్టర్‌పై బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డీ రూజ్‌వెల్ట్‌ 1941, ఆగస్టు 14న సంతకాలు చేశారు.*


*⇒ఐరాస మొదటి సమావేశం 1946, జనవరిలో లండన్‌లో జరిగింది.*


*⇒ఐరాస జెండాను 1947 అక్టోబర్‌ 20న సాధారణ సభ ఆమోదించింది. ఐరాస జెండా లేత నీలం రంగు బ్యాగ్రౌండ్‌పై తెలుపురంగులో గ్లోబు ఉంటుంది. ఈ గ్లోబుకు ఇరువైపులా శాంతికి చిహ్నమైన రెండు ఆలివ్‌ కొమ్మలు ఉంటాయి. జెండా పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉంటాయి.*


*⇒ఐరాస చిహ్నాన్ని లింకన్‌ లిన్డ్‌క్విస్ట్‌ నాయకత్వంలో తయారు చేశారు.*


*⇒ఐరాస రాజ్యాంగంలోని ప్రవేశిక ముసాయిదాను జాన్‌ క్రిస్టియాన్‌ (దక్షిణాఫ్రికా) రచించారు.*


*⇒ప్రధాన అంగాలు:*

సాధారణ సభ, సెక్రటేరియట్‌, భద్రతా మండలి, ట్రస్టీషిప్‌ కౌన్సిల్‌, ఆర్థిక సామాజిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం.


*⇒అధికార భాషలు:*

 అరబిక్‌, చైనీస్‌, ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌, స్పానిష్‌


*⇒ప్రధాన కార్యాలయం:*

 న్యూయార్క్‌ (అమెరికా)


*⇒యూరప్‌ సంబంధిత కార్యాలయం జెనీవా*


*⇒ప్రాంతీయ కార్యాలయం : బాగ్దాద్‌*


*⇒సభ్య దేశాలు:193*


*⇒ప్రస్తుత సెక్రటరీ జనరల్‌: ఆంటోనియా గుటెరస్‌ (పోర్చుగల్‌) 2017, జనవరి 1 నుంచి కొనసాగుతున్నారు.*


*⇒ఐరాస శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అంటారు.*


*⇒ఎంఎస్‌ సుబ్బులక్ష్మి ఐరాసలో (1966లో) సంగీత కచేరి చేసిన తొలి భారతీయురాలు. ఆ తర్వాత ఏఆర్‌ రెహమాన్‌ (2016లో) సంగీత కచేరి చేశారు.*


*సాధారణ సభ.*


*⇒సాధారణ సభను ప్రపంచ పార్లమెంట్‌ అని పిలుస్తారు.*


*⇒ఐరాసలోని సభ్యదేశాలన్నీ జనరల్‌ అసెంబ్లీలో సభ్యులుగా వ్యవహరిస్తాయి. ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది. అయితే, ఐదుగురు ప్రతినిధులను సభకు పంపవచ్చు. సాధారణ సభ సంవత్సరానికి ఒక్కసారైనా సమావేశమవ్వాలి. సాధారణ సభ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం ఒక సంవత్సరం. జనరల్‌ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మీ పండిట్‌.*


*⇒ప్రధాన కార్యాలయం :*

 న్యూయార్క్‌


*⇒సాధారణ సభ మొదటి సమావేశం 1948 జనవరి 10న న్యూయార్క్‌లో జరిగింది.*


*⇒సాధారణసభలో హిందీలో ప్రసంగించిన మొదటి భారత ప్రధాని వాజ్‌పేయి. రెండో ప్రధాని నరేంద్రమోదీ.*


*⇒సభ్య దేశాల సంఖ్య : 193*


*⇒ప్రస్తుత అధ్యక్షుడు : పీటర్‌ థామ్సన్‌ (ఫిజీ)*


*భద్రతా మండలి :*


*⇒తాత్కాలిక సభ్యదేశాలు రెండేండ్ల కాలానికి సాధారణ సభచే 2/3 వంతు మెజారిటీతో ఎన్నికవుతాయి. శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంటుంది. భద్రతా మండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్ల వర్ణమాల ప్రకారం రొటేషన్‌ పద్ధతిలో నెలకోసారి నిర్వహిస్తాయి. భద్రతా మండలికి 1988లో నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. 1951, 1967, 1972, 1977, 1984, 1991, 2011లలో మొత్తం ఏడు సార్లు భారత్‌ తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.*


*⇒సభ్యదేశాల సంఖ్య : 15*


*⇒తాత్కాలిక సభ్యదేశాలు : 10*


*⇒శాశ్వత సభ్యదేశాలు : 5 (చైనా, ఫ్రాన్స్‌, రష్యా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, అమెరికా)*


*⇒సభ్యదేశాల మధ్య వివాదాల పరిష్కారం, శాంతి పరిరక్షణ చర్యలను చేపట్టడం, సెక్రటరీ జనరల్‌ను ఎన్నుకోవడం భద్రతా మండలి ముఖ్య విధులు.*


*⇒ప్రధాన కార్యాలయం : న్యూయార్క్‌ ఆర్థిక, సామాజిక మండలి*


*⇒ఆర్థిక, సామాజిక మండలి సాధారణ సభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కతిక, విద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాల్లో సమన్వయం కోసం కషి చేస్తుంది.* 


*ఐరాస చార్టర్‌ ద్వారా 1945లో దీనిని స్థాపించారు. సాధారణ సభ చేత మూడేండ్ల కాలానికి 2/3 వంతు మెజారిటీతో సభ్యదేశాలు ఎన్నికవుతాయి.* 


*1/3 వంతు దేశాలు ప్రతి ఏటా పదవీ విరమణ చేస్తాయి. ప్రతి సభ్యదేశానికి ఒక ఓటు ఉంటుంది.

Post a Comment

0 Comments