October 15 is World Students Day అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవం

October 15 is World Students Day అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవం

SHYAMPRASAD +91 8099099083
0

 

.."మిస్సైల్ మ్యాన్  శ్రీ"ఏపీజే అబ్దుల్‌  కలామ్‌" గారి జయంతి  సందర్భంగా🙏🌷

అబ్దుల్ కలామ్.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన.. అనితర సాధ్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇందిరాగాంధీ నుండి ఆహ్వానం:

ఎస్‌ఎల్‌వి-3 పరీక్ష సక్సెస్‌ తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీశ్‌ధావన్‌ను, ఆయన బృందాన్ని ఆహ్వానించినప్పుడు. కలాం కూడా వచ్చారు. 1980 ఆగస్టులో వాజ్‌పేయి, కలాం తొలి సమావేశం జరిగింది.

కలాంకు ఆహ్వానం వచ్చినప్పుడు ఆయన భయపడి పోయారు. "నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలా రావాలి'' అని సతీశ్‌ధావన్‌ను అడిగారు కలాం.అప్పుడు "మీరు ఇప్పటికే #విజయం అనే #సూట్‌ ధరించి ఉన్నారు. కాబట్టి వచ్చేయండి'' అని సతీశ్‌ ధావన్‌ అన్నారు.

కలాంకు మంత్రి పదవి ఆఫర్ చేసిన వాజ్ పేయి:

ప్రఖ్యాత జర్నలిస్ట్‌ రాజ్‌చెంగప్ప తన 'వెపన్స్ ఆఫ్ పీస్' పుస్తకంలో "ఈ సమావేశం సందర్భంగా ఇందిరాగాంధీ అబ్దుల్‌ కలాంను అటల్‌ బిహారీ వాజ్‌పేయికి పరిచయం చేయగా, వాజ్‌పేయి ఆయనకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండానే పరిచయం చేసుకున్నారు.

రెండోసారి ప్రధాని అయిన 18రోజుల తరువాత తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కలాంను ఆహ్వానించారు వాజ్‌పేయి. కలాం అప్పుడు అంగీకరించినట్లయితే వాజ్‌పేయికి సమర్థుడైన మంత్రి లభించడమే కాకుండా, బిజెపి ప్రభుత్వం తాము ముస్లింలను విస్మరించలేదన్న సందేశం పంపి ఉండేది.

వాజ్‌పేయి ప్రతిపాదనపై కలాం రోజంతా ఆలోచించారు. కానీ మరుసటి రోజు వాజ్‌పేయిని కలిసి ఈ పదవిని సున్నితంగా తిరస్కరించారు. "రక్షణ పరిశోధన, అణుపరీక్ష కార్యక్రమం చివరి దశలో ఉంది. ఆ బాధ్యతలు నిర్వహించడం కూడా దేశానికి సేవ చేసినట్లే'' అని ఆయన అన్నారు. రెండు నెలల తర్వాత పోఖ్రాన్‌లో అణు పరీక్ష జరిగింది. ఆయన మంత్రి పదవిని ఎందుకు అంగీకరించలేదో అప్పుడు స్పష్టమైంది.

రాష్ట్రపతిగా కలాంను ఎంపిక చేసిన వాజ్‌పేయి:

ప్రధానమంత్రి కార్యాలయం మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తోంది, మీరు వెంటనే ఆఫీసుకు రండి అని 2002 జూన్ 10న అణ్ణా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్ కళానిధి ఏపీజే అబ్దుల్‌కలాంకు సందేశం పంపారు. వెంటనే వీసీ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు కాసేపటికి ఫోన్‌ వచ్చింది. ప్రధాని వాజ్‌పేయి లైన్‌లోకి వచ్చి "కలాం సాహెబ్, మీరు దేశానికి అధ్యక్షుడిగా కావాలి'' అన్నారు. కలాం వాజ్‌పేయికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆఫర్‌ను పరిశీలించడానికి నాకు గంట సమయం కావాలని అడిగారు. "మీరు టైమ్‌ తీసుకోండి. కానీ మీ నుంచి అవును అనే సమాధానం రావాలి , కాదు అని కాదు'' అన్నారు వాజ్‌పేయి.

 

ఏషియాడ్‌ విలేజ్‌లోని డీఆర్‌డీఓ గెస్ట్‌హౌస్‌లో ఉండాలని కలాం నిర్ణయించుకున్నారు. 2002 జూన్‌18న వాజ్‌పేయి, ఆయన క్యాబినెట్ సహచరుల సమక్షంలో కలాం తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కలాం దరఖాస్తు ఫారం నింపుతుండగా " మీరు కూడా నాలాగే వర్జిన్‌'' అని వాజ్‌పేయి ఆయనతో చమత్కరించారు. కలాం వెంటనే సమాధానమిస్తూ "నేను వర్జిన్‌నే కాదు, బ్రహ్మచారిని కూడా'' అన్నారు.

కలాం సూట్ కథ:

అధ్యక్షుడైన తరువాత ఎలాంటి దుస్తులు ధరించాలన్నది కలాం పెద్ద సమస్య. కొన్నేళ్లుగా నీలిరంగు చొక్కా, స్పోర్ట్స్ బూట్లు ధరించిన కలాం, రాష్ట్రపతిగా వాటిని ధరించలేకపోయారు. అనేకమంది అధ్యక్షులకు సూట్లు కుట్టిన రాష్ట్రపతి భవన్‌ దర్జీ ఆయనకు కూడా కొలతలు తీసుకున్నారు.

 

కలాం జీవిత చరిత్ర రచయిత, సహోద్యోగి అరుణ్ తివారీ తన 'ఎపిజె అబ్దుల్ కలాం- ఎ లైఫ్' అనే పుస్తకంలో "కొద్దిరోజుల తరువాత కలాం కోసం కుట్టిన నాలుగు కొత్త బంద్‌గలా సూట్లను దర్జీ తీసుకువచ్చారు. కొద్దినిమిషాల్లోనే ఆయన తన దుస్తులను మార్చేసుకున్నారు. కానీ ఆయన సంతోషంగా లేరు. "నేను ఇందులో ఊపిరి తీసుకోలేక పోతున్నాను. ఏమైనా మార్పుకు అవకాశం ఉందా'' అని అడిగారని వెల్లడించారు.

 

దర్జీ ఇబ్బందుల్లో పడిపోయారు. అప్పుడు కలాం మెడ దగ్గర కొంచెం కత్తిరించండని ఆయనకు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ తరహా సూట్‌ను కలాం సూట్‌ అని పిలవడం మొదలు పెట్టారు.

టై ధరించడం పట్ల కలాం విముఖత చూపేవారు. తాబేలులాంటి సూట్‌కు టైతో ఇంకా ఊపిరి ఆడదని ఆయన అనేవారు. "ఒకసారి ఆయన తన టైతో కళ్లద్దాలు తుడుచుకోవడం నేను చూశాను. అలా చేయకూడదని నేను ఆయనకు చెప్పాను. కానీ ఈ టైతో ఎలాంటి ఉపయోగం లేదు. ఇందుకైనా ఉపయోగపడనీయండి అన్నారు'' అని అరుణ్ తివారీ వెల్లడించారు.

రుద్రవీణ:

 

నిష్టగా ఉదయం ప్రార్ధనలు

ఎంత బిజీగా ఉన్నప్పటికీ కలాం తన కోసం కొంత సమయం కేటాయించుకునే వారు. రుద్రవీణను వాయించడం ఆయనకు ఎంతో ఇష్టం.

"ఆయనకు నడక అంటే కూడా ఎంతో ఇష్టం. అది కూడా ఉదయం పదిగంటలకు, మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు కాసేపు నడిచేవారు. ఉదయం పదిన్నరకు అల్పాహారం తీసుకునేవారు.

సాయంత్రం నాలుగున్నరకు భోజనం చేసేవారు. మళ్లీ రాత్రి 12 గంటలకు తినేవారు'' అని కలాంకు ప్రెస్‌ సెక్రటరీగా పని చేసిన ఎస్‌.ఎం.ఖాన్ అన్నారు.

పూర్తి శాఖాహారి:

"డాక్టర్ కలాం ముస్లిం మతంతోపాటు హిందూ మత ప్రార్ధనలు కూడా చేసేవారు. ఆయన ఖురాన్‌, భగవద్గీతలను చదివేవారు. తిరువళ్లువర్ బోధనలతో కూడిన 'తిరుక్కురళ్‌' పుస్తకాన్ని తమిళంలో చదివేవారు. పూర్తి శాఖాహారి, మద్యం ముట్టుకునేవారు కాదు. ఆయన బస చేసేచోట శాఖాహారాన్ని మాత్రమే వడ్డించాలని రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. హిజ్‌ ఎక్సలెన్స్‌ అని పిలిపించుకోవడం ఆయనకు అసలు ఇష్టం ఉండేది కాదు'' అని ఖాన్‌ వివరించారు.

కుటుంబం కోసం రాష్ట్రపతి భవన్‌కు అద్దె చెల్లించిన కలాం:

తాను ఎంతగానో ప్రేమించే అన్న ముత్తు మరైకాయర్‌ను తనతోపాటు రాష్ట్రపతి భవన్‌లో ఉండాలని కలాం ఎప్పుడూ అడగలేదు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని సోదరుడి మనవడు గులాం మొయినుద్దీన్ ఢిల్లీలో మునిర్కాలో ఒక అద్దె గదిలో నివసించేవారు.

 

2006 మే నెలలో కలాం తన కుటుంబంలోని 52మందిని ఢిల్లీకి ఆహ్వానించారు. వారంతా రాష్ట్రపతి భవన్‌లో 8 రోజులు బస చేశారు. " కలాం తన జేబు నుంచి వారి ఖర్చులను భరించారు. ఒక కప్పు టీని కూడా లెక్కించారు.

వారంతా అజ్మీర్‌కు బస్సులో వెళ్లగా, ఆ బస్సు ఛార్జీలను కూడా కలాం భరించారు. ఆయన కుటుంబం వెళ్లిపోయిన తర్వాత కలాం రాష్ట్రపతి భవన్‌కు రూ.352,000 చెక్కును రాష్ట్రపతి భవన్‌ కార్యాలయానికి పంపారు'' అని కలాంకు సెక్రటరీగా పని చేసిన పీఎం నాయర్‌ నాతో అన్నారు.

2005 డిసెంబర్‌లో ఆయన సోదరుడు ఏపీజే ముత్తు మరైకాయర్, ఆయన కుమార్తె నజీమా, మనవడు హజ్ యాత్రకు వెళ్లారు. సౌదీ అరేబియాలోని భారత రాయబారి ఈ విషయం తెలుసుకుని, వారికి అన్ని రకాల సాయం చేస్తానని రాష్ట్రపతికి తెలిపారు. కానీ కలాం "నా 90 ఏళ్ల సోదరుడు ఏ ప్రభుత్వ ఏర్పాట్లు లేకుండా సాధారణ యాత్రికుడిలాగా హజ్ చేయడానికి అనుమతించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను'' అని అన్నారు.

అనాథాశ్రమానికి ఇఫ్తార్ విందు సొమ్ము:

కలాం సెక్రటరీ నాయర్ నాకు మరో ఆసక్తికరమైన కథను చెప్పారు. "2002 నవంబర్‌లో ఒకసారి కలాం నన్ను పిలిచి ఇఫ్తార్ విందు ఎందుకు నిర్వహించాలో చెప్పు అన్నారు. ఇఫ్తార్‌ విందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కలేయించారు. సుమారు రూ. పాతిక లక్షలవుతందని తేలింది."మనం ఈ డబ్బును అనాథాశ్రమనికి ఎందుకు ఇవ్వకూడదు? ఈ డబ్బు వృథా కాకుండా చూడమని నాకు చెప్పారు'' అని నాయర్‌ వెల్లడించారు.

 

"రాష్ట్రపతిభవన్‌ నుంచి పిండి వంటలు, పప్పులు, దుప్పట్లు, స్వెట్టర్లను 28 అనాథాశ్రమాలకు పంపించారు. ఇది ఇక్కడితో ఆగలేదు.

 

ఆయన మళ్లీ నన్ను పిలిచి ఇప్పుడు మీరు చేసిన ఖర్చంతా ప్రభుత్వానిదని, నా దగ్గరున్న ఒక లక్ష రూపాయలు కూడా ఇస్తాను. వాటిని కూడా ఇలాగే అనాథ పిల్లల కోసం ఖర్చు పెట్టండి అని నన్ను కోరారు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దన్నారు'' అని నాయర్‌ వెల్లడించారు.

నెమలికి కణితి ఆపరేషన్‌:

డాక్టర్‌ కలాంలో మానవీయ విలువలు ఎక్కువ. ఒకసారి చలికాలంలో రాష్ట్రపతి భవన్‌లో తోటలో నడుస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్‌ క్యాబిన్‌లో ఏసీ వ్యవస్థ లేదని, కఠినమైన శీతాకాలంలో కూడా సెక్యూరిటీ గార్డులకు చలిపుట్టనంతగా వేడి ఉందని ఆయన గమనించారు. సంబంధిత అధికారులను పిలిచి శీతాకాలంలో గార్డు క్యాబిన్లో హీటర్, ఎండాకాలంలో ఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.

 

ఎస్.ఎమ్.ఖాన్ మరో ఉదంతాన్ని వివరించారు. "ఒకసారి మొఘల్ గార్డెన్‌లో నడుస్తుండగా, ఒక నెమలి నోరు తెరవలేకపోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే రాష్ట్రపతి భవన్‌ వెటర్నరీ డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ను పిలిచి నెమలికి ఆరోగ్య పరీక్షలు చేయమని కోరారు. ఈ పరీక్షల్లో నెమలి నోటిలో కణితి ఉందని, అందుకే నోరు తెరవలేకపోతోందని తేలింది. కలాం ఆదేశాలతో డాక్టర్ సుధీర్‌ నెమలికి శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. కొన్ని రోజులు ఐసీయూలో ఉంచి, తర్వాత దాన్ని మొఘల్ గార్డెన్‌లో వదిలి పెట్టారు.

టాంజానియా చిన్నారులకు ఉచిత ఆపరేషన్‌:

2005 అక్టోబర్ 15, తన 74వ పుట్టిన రోజున కలాం హైదరాబాద్‌లో ఉన్నారు. కేర్‌ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్‌ చేయించుకున్న టాంజానియాకు చెందిన కొంతమంది పిల్లలను కలవడంతో తన దినచర్యను ప్రారంభించారు. అక్కడ ఉన్న ప్రతి చిన్నారిని పలకరించి వారికి చాక్లెట్లు పంచి పెట్టారు.

 

అప్పటికే ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ #సుశీల్‌కుమార్‌ షిండే, ముఖ్యమంత్రి #రాజశేఖర్‌రెడ్డిఆయన కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారిని వదిలేసి ఆయన పిల్లలకు ఇస్తున్న ప్రాథాన్యతను చూసి అంతా ఆశ్చర్యపోయారు.

 

"2000 సెప్టెంబర్‌లో కలాం టాంజానియా సందర్శించినప్పుడు, పుట్టుకతోనే గుండెజబ్బుతో బాధపడుతున్న పిల్లలు చికిత్స అందక చనిపోతున్నారని కలాం తెలుసుకున్నారు.

 

అక్కడి నుండి వచ్చాక ఈ పిల్లలను, వారి తల్లులను దారుస్సలాం నుండి హైదరాబాద్‌కు తీసుకు రావడానికి ఏదో ఒక విధంగా ఉచిత ఏర్పాట్లు చేయాలని, అప్పటి ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ వి.తులసీదాస్‌తో మాట్లాడాలని ఆయన నన్ను కోరారు. ఇందుకు తులసీ దాస్‌ కూడా అంగీకరించారు. కేర్ హాస్పిటల్ హెడ్‌ డాక్టర్ సోమరాజు, హార్ట్‌ సర్జన్ డాక్టర్ మన్నం గోపీచంద్ వారికి ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకొచ్చారు.

 

ఈ పిల్లలను #గుర్తించడానికి టాంజానియాలో భారత హైకమిషనర్ దారుస్సలాం వెళ్లారు. 24మంది పిల్లలు, వారి తల్లులను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. 50మంది ఉండటానికి, తినడానికి కేర్ ఫౌండేషన్ ఉచిత ఏర్పాట్లు చేసింది. వీరంతా హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని సురక్షితంగా టాంజానియాకు వెళ్లిపోయారు'' అని అరుణ్‌ తివారి మరో ఉదంతాన్ని వివరించారు.

 

#శ్యామ్‌ మానెక్‌షాను కలిసిన కలాం:

 

తన పదవీ కాలం ముగిసేనాటికి 1971 వార్‌ ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షాను కలవాలని కలాం కోరుకునేవారు. చివరకు 2007 ఫిబ్రవరిలో ఆయన్ను కలుసుకోడానికి ఊటీ వెళ్లారు.

 

అయితే ఆయనకు ఫీల్డ్‌ మార్షల్‌ బిరుదు మాత్రమే ఇచ్చారని, ఇతర సౌకర్యాలు ఇవ్వలేదని గుర్తించారు. తిరిగి ఢిల్లీ వచ్చాక ఆయన కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షాతోపాటు, మార్షల్‌ అర్జున్‌సింగ్‌కు వారు పదవి విరమణ చేసినప్పటి నుంచి ఉన్న బకాయిలన్నీ చెల్లించే ఏర్పాటు చేశారు కలాం.

 

#స్విట్జర్లాండ్-సైన్స్ డే:

 

2005 may 26 తారీఖున కలాం గారు స్విట్జర్లాండ్ పర్యటించారు. దేశ ప్రభుత్వం ఏకంగా మే 26 నుండి సైన్స్ డే గా ప్రకటించింది.

 

 27 july 2015 న  #యువతతో ఉపన్యసిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తెల్లని పెట్టని హాస్పిటల్లో చేర్చారు కానీ ఆయనలో చలనం లేదు సాయంత్రం ఏడు గంటల 45 నిమిషాలకు గుండెపోటు కారణంగా చనిపోయాడనే వార్త దేశమంతా విని బాధ పడని వ్యక్తి అంటూ ఎవరూ లేరు చివరి క్షణంలో కూడా ఆయనకి ఇష్టమైన యువత కోసం ప్రసంగిస్తూ తుది శ్వాస విడిచారు.

 

..*Dr.A.P.J. అబ్దుల్ కలాం వదిలిపెట్టిన ఆస్తిని అంచనా వేశారు.*

 

 అతను యాజమాన్యంలో ఉన్నారు, దేశ అత్యున్నత స్థానంలో ఉన్నారు. కానీ,

 

 6 ప్యాంట్లు (2 DRDO యూనిఫాంలు)

 4 చొక్కాలు (2 DRDO యూనిఫాంలు)

 3 సూట్లు (1 వెస్ట్రన్, 2 ఇండియన్)

 2500 పుస్తకాలు

 1 ఫ్లాట్ (అతను విరాళం ఇచ్చాడు)

 1 పద్మశ్రీ

 1 పద్మభూషణ్

 1 భారత్ రత్న

 16 డాక్టరేట్లు

 1 వెబ్‌సైట్

 1 ట్విట్టర్ ఖాతా

 1 ఇమెయిల్ ఐడి

 

 అతని వద్ద టీవీ, ఎసి, కారు, ఆభరణాలు, షేర్లు, భూమి లేదా బ్యాంక్ బ్యాలెన్స్ లేవు.

 

 అతను తన గ్రామ అభివృద్ధికి గత 8 సంవత్సరాల పింఛను కూడా విరాళంగా ఇచ్చాడు.

 

 అతను నిజమైన దేశభక్తుడు మరియు నిజమైన భారతీయుడు

 

 భారతదేశం ఎప్పటికీ మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది సార్.

 

 మీ స్నేహితులు మరియు ప్రియమైన వారందరూ దీన్ని తప్పకుండా చదవాలని నిర్ధారించుకోండి

 దయచేసి ఆవేశపూరిత పోస్టులో లేక అంబానీ కుమార్తె యొక్క వివాహ వీడియోనో ఫార్వార్డ్ చేయడానికి బదులుగా దీన్ని చదవండి మరియు ఫార్వార్డ్ చేయండి.

 🙏🙏🙏


#ప్రపంచ విద్యార్థుల దినోత్సవం:

 

#భారతదేశపు క్షిపణి శాస్త్రవేత్త, 11వ భారత రాష్ట్రపతి అయిన ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 2015, జులై 27న మరణించాడు. ఆ సందర్భంగా ఐక్యరాజ్యసమితి అబ్దుల్ కలామ్ కు ఘన నివాళి అర్పించింది. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కలాం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నింపడానికి ప్రయత్నం చేశాడనీ, భారత రాష్ట్రపతిగా ప్రపంచ శాంతి కోసం పరితపించారని ఐక్యరాజ్యసమితి కొనియాడుతూ అబ్దుల్‌ కలాం జయంతి రోజైన అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా నిర్ణయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!