అసలు స్త్రీ దగ్గర ఏముంది ? - A to Z 2512

HIGHLIGHTS

అసలు స్త్రీ దగ్గర ఏముంది ?

అసలు స్త్రీ దగ్గర ఏముంది
కేవలం అవయవాల మార్పుఅనుకుంటే అది అవివేకం

స్త్రీ కన్నుల్లో ఏముంది
ప్రేమ సముద్రాలు పొంగుతాయి
ప్రేమలో తడవని వారు
తనివితీరా  తడవచ్చు

స్త్రీ పేదాల్లో ఏముంది
భరోసానిచ్చే మాటలను రాశులుగా కుమ్మరిస్తుంది
దిక్కుతోచని వారికి  మాటల రాశులను దిక్కులుగా చూపిస్తుంది

స్త్రీ మనసులో ఏముంది 
సముద్రమంత విశాల హృదయం కలది ఎవరినైనా అక్కున చేర్చుకోగలదు

స్త్రీ ఒడిలో ఏముంది
ఎంతటి వాడైనా ఒడిలోకి చేరగానే చిన్న పిల్లాడై పోతాడు

స్త్రి నడక లో ఏముంది
తానే అడుగులు నేర్పుతూ
ఏడడుగులు  ఏపిస్తూ జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది

స్త్రీ సృష్టి రహస్యం
ఆమెను ఎప్పటికి ఛేదించలేము
ప్రేమను ఆస్వాదించడం తప్ప

No comments