కథ:-__మేకల గుంపు

కథ:-__మేకల గుంపు 

అనగనగా ఒక అడవిలో ఒక మేకల గుంపు నివసిస్తూ ఉండేది. అవి అడవిలో ఆకులు అలములు తింటూ హాయిగా జీవిస్తూ వుండేవి. కొద్ది కాలం తర్వాత వాటికి ఒక రాజు కావాలని అనుకున్నాయి. అనుకున్నదే తడవుగా ఒక బలిష్టమైన మేకను ఎన్నుకొని రాజుని చేశాయి. ఆ రాజు ఆ మేకల మందలో చిన్న చిన్న గొడవలు వస్తే తీర్చటం చేస్తూ ఉండేవాడు. దీనితో ఆ మేకలు మురిసిపోతూ ఆ రాజు మేక చెప్పేదే

వేదమన్నట్లును రాజుని అనుసరిoచడం మొదలుపెట్టాయి. దీనితో ఆ రాజుమేక నేను ఈ మేకలకు ఏది చెబితే అదే ఒప్పు అన్న గర్వంతో ఉండేది. అలా రోజులు గడుస్తున్న కొద్ది ఆరాజు చుట్టూ కొన్ని చెప్పుడు మేకలు చేరి మిగిలిన గుంపులో వున్న మీకలపైన లేనిపోని నిందలు వేస్తూ తమ పబ్బాన్ని గడుపుకునేవి. అలా చెప్పుడు మేకలు ఒక రోజు ఆ రాజు మేకతో ఇలా అన్నాయి? గుంపులో మేకలు రాజు మాటలు వినడం లేదని, తన మాటంటే వాటికి లెక్కలేదని అంటూ లేనిపోని వి చెప్పడం మొదలెట్టాయి. అదివిన్న ఆ రాజు మేక కోపంతో వూగిపోతూ ఆ మేకలపైన కోపంతో ఆ మేకల్ని ఎలాగైనా పూర్తిగా తన దారిలోకి తెచ్చుకోవడానికి గుంటనక్కల్తో స్నేహం చేసింది. ఆ గుంటనక్కల్ని ఆ మేకలమందల పై

వుసిగోడుతూ దాడులు చేస్తూభయబ్రాంతులకు గురిచేసేది. దీంతో ఆ మేకలు భయంతో ఆ రాజు మేక చెప్పేది వింటూ కాలం గడిపేవి. దీంతో ఆ రాజు మేక ఇంకా రెచ్చిపోతూ , బలహీనమైన మేకల ఆహారాన్ని కూడా దోచుకునేది. తిరగబడే మేకలని  గుంటనక్కలతో దాడిచేయించేది. అలా అవి నిస్సహాయంగా ,ఏమి చెయ్యలేక కాలం వెళ్లదీసేవి.ఇలా కొద్దిరోజుల్లోనే ఆ దాడులు వల్ల, తిండిలేక ఆ మేకల గుంపు తరిగిపోతు ఉండేది.

 కొన్ని అ రాజు కి భయపడుతూ కొండల్లోకి,తుప్పల్లోకి వెళ్లిపోయాయి.కొన్నిఅడవిని వదిలి పారిపోయాయి. ఇలా ఎన్నో బాధలు పడ్డ మేకలు కొద్ది రోజుల గడిచాక కొన్ని మేకలు కలిసి సమావేశం అయ్యి ఎందుకు మనకి ఇలాంటి గతి పట్టిందని అనుకొని మనలో ఐకమత్యం లేకపోవడం , మనలోని నిస్సహాయత వల్ల రాజు ఎన్నితప్పులు చేసిన కలసి ఎదిరించి లేకపోవడం వల్లే ఈ కష్టాలు పడ్డామని ఇక చావైన, బ్రతుకైన కలిసి ఎదుర్కోవాలని, ఇన్నాళ్లు తమకు బలమైన కొమ్ములు వున్న ఎమిచేయలేకపోయామని సిగ్గుపడుతూ ఆ రాజు మేకకు మనమంతా కలిసి తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించుకొని మిగతా పారిపోయిన మేకలతో కలిసి బయలుదేరాయి. ఇలా ఒక్కొక్కటి కలిసి పదులు, వందలుగా పోరాడాయి. చివరకు విజయం సాధించాయి. ఆ అడవినుండి ఆ దుర్మార్గపు రాజు మేకను, ఆ గుంటనక్కల్ని తరిమివేసి నాయి. అప్పటినుండి అవి హాయిగా అడవిలో జీవిస్తూ ఆనందంగా ఉన్నాయి.!!

గమనిక :-
  
 మనమందరము ఐక్యమత్యంగా ఉండి,

 కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం,

 మార్చి 23 నుండి మార్చి 31 వరకు

 కర్ఫ్యూ పాటిద్దాం

మన దేశన్ని సురక్షితంగా కాపాడుకుందాం ....!!

Post a Comment

0 Comments