Responsive Advertisement

మనసు కధలు స్పూర్తి కధలు విడదీయలేని బంధం...!!

మనసు కధలు  స్పూర్తి కధలు విడదీయలేని బంధం...!!

రాజ్యలక్ష్మి గారు రాజ్యలక్ష్మి గారు అని గుమ్మం దగ్గర నిలబడి అరుస్తున్నాడు పెళ్ళిళ్ల పేరయ్య.... గబగబ వంటగదిలో నుంచి వచ్చి, ఏమిటి మీ హడావిడి ముందు ఇలా కూర్చోండి. అని ఎదురుగా ఉన్న కుర్చీ వైపు చూపించింది... ఉండండి మజ్జిగ తీసుకొని వస్తాను అని వంటగది వైపు నడిచింది... ఆగండి.. ఆగండి.. ముందు నేను చెప్పిన విషయం విన్నాక ఏకంగా పాయసమే చెద్దూరు...

మీ అబ్బాయికి మంచి సంబంధం ఒకటి తెచ్చాను అండి... పిల్ల మంచి రూపవతి, గుణవతి... పట్నం పిల్లె అయినా అన్ని పద్దతులు తెలిసిన పిల్లా... అని అమ్మయి ఫొటో ఇచ్చాడు... చూడగానే నచ్చేసింది....

అమ్మాయి బాగుంది పేరయ్య అంది....

అబ్బాయుని కూడా ఒక మాట అడిగితే, అమ్మాయిని చూడటానికి వెళదాం అండి... అవసరం లేదు.. నాకు నచ్చితే నా కొడుకుకి నచ్చినట్టే... మంచిరోజు చూసుకొని అమ్మాయిని చూడటానికి వెళదాం...

రాజ్యాలక్ష్మి కొడుకు రాంబాబు...తన కొడుకు అంటె ఆమెకి ప్రాణం.. పెళ్లి అయినా ఏడు ఏళ్లకి పుట్టిన కొడుకు... ఎంతో అపురూపంగా పెంచుకుంది... తన పంచ ప్రాణాలు కొడుకు మీదే పెట్టుకుంది... రాంబాబు కూడా తల్లి మాట జవదాటని కొడుకు...

ఒక మంచిరొజున పెల్లికూతురిని చూడటానికి వెళ్లటం... అన్ని కుదిరి పెళ్లి జరిగిపోవటం... అన్ని తొందర తొందరగా జరిగిపొయాయి...

పెళ్ళికూతురు సీత చదువుకున్న అమ్మాయి... చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం చేద్దాం అనుకుంది.. కాని, ఇంట్లో పెద్దవాళ్ళు మంచి సంబంధం కుదిరేసరికి రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేసారు... రాంబాబుకి చదువు లేకపోయినా, మంచివాడు, మంచి పేరు, ఆస్తి పాస్తూలు ఉన్న కుటుంబం, కాబట్టి సీతని అతనికి ఇచ్చి వివాహం జరిపించారు... తల్లిదండ్రులు మాటకి గౌరవం ఇచ్చి, పెద్దలు చూసిన పెళ్లి చేసుకొని అత్తవారింట్లో అడుగు పెట్టింది...

పెద్ద చదువులు చదువుకోని, మంచి ఉద్యోగం చేసుకొవాలి అనుకున్న నేను ఈ చదువు లేని వాడిని పెళ్లి చేసుకొని, ఈ పల్లెటూరులో ఏం సుఖపడతాను నేను... అనుకొని శొభనం గదిలోకి అడుగుపెట్టింది... చేతిలో ఉన్నా పాలగ్లాసు టేబుల్ మీద పెట్టేసి, పక్కనే ఉన్న సొఫాలొ పడుకొని కళ్లు మూసుకొని ఉంది... రాంబాబు విషయం అర్థం చెసుకొని, లైట్ ఆఫ్ చేసి, మంచం మీద పడుకున్నాడు... ప్రటిరొజు ఇదే తంతు... ఒకరోజున రాంబాబు దైర్యం చేసి సీతను అడిగేసాడు...

మన పెళ్లి అయినా దగ్గర నువ్వు కనీసం ఒక మాట అయినా మాట్లాడలేదు... నీకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదా చెప్పు... అని అడిగాడు...

ఎలా ఇష్టం ఉంటుంది... నువ్వు అసలు నాకు సరిపొతావా!!! చదువు లేదు.. ఉద్యోగం లేదు..పెద పిసుక్కొని పిడకలు కొట్టుకుని బ్రతికే నీకు, నేను భార్యగా రావటం నా దురదృష్టం... మంచి ఉద్యోగం చేసుకొని, స్వతంత్రంగా బ్రతకాలి అనుకున్న నేను నిన్ను పెళ్లి చేసుకోవలసి వచ్చింది... పోని నీకు చదువు లేకపోయినా, నేను అయినా నాకు నచ్చిన ఉద్యోగం చేసి, నా కాళ్ల మీద నేను నిలబడాలి అనుకుంటే, నన్ను మా వాళ్ళు ఈ పల్లెటూరిలో పడేసారు... ఇక్కడ నేను ఏం చెయ్యను... నీతో కలిసి పేడ పిసకనా... అంటూ విసురుగా వెళ్లిపోయింది...

సీత అన్న మాటలకి రాంబాబు మనసు చాలా బాధ పడింది... అమ్మాలా అర్థం చేసుకొనే భార్యా వస్తూంది అనుకుంటే, ఇలా జరిగింది ఏంటి అని బాధ పడ్డాడు..

నిజానికి సీతని మొదటిసారి చూసినపుడె, ఆమెని ఇష్టపడ్డాడు... ఆమెతో జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న రాంబాబుకి, సీత అలా అనేసరికి వాళ్ల కాపురం ఏమైవుతుందో అని భయం మొదలయ్యింది...

పెళ్లి అయ్యి ఇరవై రోజులు అవుతున్నా, వంటగది వైపు చూసింది లేదు... కనీసం వాకిట్లో ముగ్గు వేసింది అయినా లేదు... అని రాజ్యలక్ష్మి విసుక్కుంటూ ఉంది... తన అంతటా తానే వచ్చి అత్తగారు ఏమైనా కావాలా అని అడుగుతాది అని చూసింది... సాయం మాట అటు ఉంచితే కనీసం అత్తగారు అని ఒకసారి అయినా పిలించింది లేదు.. ఏమిటి ఈ పిలా కనీసం నా కొడుకుతో అయినా సవ్యంగా ఉంటుందా లేదా!! అనుకొని అమ్మాయి సీత ఒకసారి ఇలా రా!!! అని కేక వేసింది.. చెవిలో ఏవో పెట్టుకొని తల తిప్పేస్తూంది తెగ... దగ్గరకి వెళ్లి ఒక్క కేక వేసింది గట్టిగా... అంతే ఆ పిలుపుకి ఇంట్లో ఉన్నా అందరూ వచ్చేశారు.. ఏంటి అండి!! ఎందుకూ అలా అరుస్టున్నారు అంది... హా!!! మెల్లిగా పిలిస్తే నీకు వినిపించటం లేదు కదా!! అందుకే ఇలా అరవాల్సి వస్తూంది... ఎందుకు పిలిచారో చెప్పండి...

అండీ ఏంటి అండీ.. అత్తయ్యా అని పిలవలేవా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నీ పద్దతి ఏం బాగాలేదు అమ్మాయి.. అటు భర్త తో సరదాగా ఉన్నది లేదు.. ఇటు అత్తమామలని ఎన్నడూ పట్టించుకున్నది లేదు... అసలు కొత్త కోడలు అంటే ఎలా ఉండాలి... కొత్త కదా!! మొహామాటం ఏమో అనుకున్నా, కాని అది మొహమాటం లా లేదు.. తల పొగరులా ఉంది... అసలు నా కొడుకుతో అయినా అన్యోన్యంగా ఉంటున్నావా లేదా... అని కొడుకు వైపు చూసింది.. అది ఏం లేదు అమ్మా.. మేము బాగానె ఉన్నాము.. తనకి నేను నచ్చచెపుతాను... నువ్వు ఇలా రా!అని సీతా చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకువెళ్ళాడు...

నీ చెయ్యి పట్టుకున్నందుకు క్షమించు సీత.. కాని, నేను అలా చెయ్యకపోతే, అమ్మకి అనుమానం వ

స్తూంది అని అలా చేసా.. మనం ఇద్దరం అన్యోన్యంగా లేము అని అమ్మకి తెలిస్తే ఆమె బాధ పడుతోంది... నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా నీ తల్లిదండ్రులు బాధ పడకూడదు అని నాకు అర్థం అయ్యింది.. అలాగే మా అమ్మ బాధపడినా కూడా నేను తట్టుకోలేను.. దయచేసి మా అమ్మతో దురుసుగా ప్రవర్తించవద్దు.. ఈ రోజు కాకపొయినా ఏ రోజుకు అయినా, మీకు ఈ పెళ్లి మీద మన బంధం మీద నమ్మకం కలుగుతుంది అని, నన్ను మీ భర్టగా స్వీకరిస్తారు అనే నమ్మకం నాకు ఉంది.. అని చెప్పి వెళ్లిపోయాడు...

భర్త అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంది.. రాత్రి పని అయ్యాక ఇంటికి వచ్చిన రాంబాబుకి తల్లి ఎదురు వెళ్లి, నీ భార్యా ప్రొద్దున నువ్వు వెళ్లిన దగ్గర నుంచి ఆ గదిలో నుంచి బయటకి రాలేదురా! నేను ఎంత పిలిచినా పలకటం లేదు.. రాంబాబు ప్లేట్ లో భోజనం వడ్డించి సీత కోసం తీసుకువెళ్ళాడు.. తలుపు తట్టి పిలవగానే, రాంబాబు గొంతు వినగానే, ఒక్క పరుగున వచ్చి తలుపు తీసింది.. ఎదురుగా వున్న రాంబాబుని చూడగానే, తన కళ్లలో ఏదో తెలియని మెరుపు.., మనసు నిండా సంతోషం.. ఎప్పుడూ చూసినా రాంబాబులా కాకుండా ఈ రోజు ఎంటో కొత్తగా కనిపిస్తూన్నాడు.. తన భర్త, తన కోసం భోజనం తీసుకు వచ్చినందుకు తన మీద ఉన్న శ్రద్ద చూసి సంతోషించింది...

క్రమ క్రమంగా సీతకి రాంబాబు మీద ఉన్న అభిప్రాయం మారి, అతని పట్ల ప్రేమ మొదలవుతున్నది..

సీతగారు, రేపు మనం ఒక చోటికి వెళ్ళాలి అండి.. మీరు కొంచెం త్వరగా బయలుదేరి ఉండండి... ఎక్కడికి వెళ్ళాలో చెప్పాండి.. మీరు ప్రొద్దునే రెడీ అయ్యి ఉండండి..

ప్రొద్దునే లేచి రెడీ అయ్యి, నేను రెడీ అయిపొయాను.. మీరు ఇంకా బయలుదెరలేదా!! వచ్చేస్తా అండీ.. మీరు అలా కాసేపు బయట ఉండండి.. నేను పది నిమిషాలలో వచ్చేస్తా.. సరె, అని బయటకి వచ్చి చూడగా కొత్త స్కూటి ఉంది.. అది చూడగానే పరిగెత్తుకు లోపలికి వెళ్లి, ఆ స్కూటి ఎవరిది అంది... అది మీదే అండి.. మీ కొసమే తీసుకున్నా, మీకు నచ్చిందా.. నిజంగానా!! చాలా చాలా నచ్చింది ఓయ్! అని థాంక్స్ చెప్పింది.. రండి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చెయ్యండి.. బయటకి వెళదాం.. సరె, అని బండి స్టార్ట్ చేసి ఇద్దరూ కలిసి బయటకి వెళ్ళారు.. పెళ్లి అయినా ఇన్ని రోజులకి కొడుకు, కోడలు కలసి అలా బయటకి వెళ్లటం చూసి చాలా సంతోషించింది...

ఆపండి.. ఆపండి సీతగారూ మనం రావాలసిన చోటు ఇదే..

ఇది ఏదో స్కూల్ లా ఉందే... ఇక్కడికి ఎందుకు.. మీరు రండి చెప్తాను.. సరె, పదండి అని లోపలికి వెళ్ళారు ఇద్దరూ..

అక్కడా స్కూల్ ఓపెనింగ్ జరుగుతుంది.. అందరూ రాంబాబు గారు, మేడమ్ గారు రండి.. రండి.. ఇంత ఆలస్యం అయితే ఎలా అండి.. మీ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు.. అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది సీత.. రాంబాబు గారు మీ చేతుల మీదుగా ఓపెనింగ్ చెయ్యండి.. ఒక్క నిమిషం ఆగండి.. మా అమ్మ వచ్చేస్తుంది.. అదిగో మా అమ్మ వచ్చేసింది.. ఏంటి అమ్మా ఆలస్యం అయ్యింది.. అందుకే నిన్ను మాతో కలిసి రమ్మన్నాను.. చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా అన్నావు.. నువ్వు, కోడలు కలిసి వెళుతుంటే నేను ఎందుకురా మధ్యలో అందుకే నేను వెనుక వస్తా అన్నాను.. సరె కాని, ఆలస్యం అవుతోంది.. వచ్చి ఓపెనింగ్ చేద్దూవు రా!!

నేను ఎందుకురా, స్కూల్ ఓపెనింగ్ చేసేది నేను కాదు అమ్మ.. నువ్వు.. ఇంక నువ్వు ఏం మాట్లాడకుండా రా!! అని, తల్లి చేత్తో రిబ్బన్ కట్ చేయించి, స్కూల్ ఓపెనింగ్ చేయించాడు..

సీత గారు ఇలా రండి.. మీకు ఒకటి చూపిస్తాను.. అని, ఒక రూమ్ లోనికి తీసుకువెళ్ళాడు.. అక్కడ బయట M.D Room అని బోర్డు ఉంది.. ఇలా రండి, వచ్చి ఈ సీట్ లో కూర్చోండి.. నేను ఆ సీట్ లో కూర్చోవటం ఏంటి... అబ్బా.. మీరు ఇలా రండి అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్లి, ఆ చైర్ లో క్కూర్చొపెట్టి, ఇక నుండి ఈ స్కూల్ భాధ్యత అంతా మీదే అండి.. మీరు ఈ స్కూల్ కి M.D. అన్న మాట..

మీరు పెద్ద చదువులు చదువుకోని, మంచి ఉద్యోగం చెయ్యాలి అనుకున్నారు.. కాని, నాలాంటి పల్లెటూరి వాడిని చేసుకున్నా అని బాధపడుతున్నారు.. జరిగిన దానిని నేను ఎలానూ మార్చలేను.. కనీసం మీరు అనుకునట్టుగా మీ కాళ్ల మీద మీరు నిలబడేలా చెయ్యగలిగితే, మీ బాధ కొంచెం అయినా తీర్చినట్టు అవుతుంది అని, అలాగే మా ఊరిలొ స్కూల్ పాడు అయి చాలా రోజులు అవుతోంది.. అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.. పిల్లలు అందరూ చాలా దూరం నడిచి పక్క ఊరికి పోయి చదువుకుంటున్నారు.. ఈ రెండు సమస్యలకీ పరిష్కారం దొరుకుతుంది అని, ఇలా ఈ స్కూల్ రీ మోడలింగ్ చేయించి, మళ్లీ రీ ఓపెనింగ్ చేయించాను.. మీకు ఇప్పుడు సంతోషంగానే ఉందా అండి.. అని సీత వైపు తిరిగేసరికి, తన కళ్ళల్లో పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు, వెంటనే భర్త కాళ్ల మీదపడి నన్ను క్షమించండి.. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాను.. అయ్యో సీతగారూ ఏం చెస్తూన్నారు అండి లెవండి.. అని పైకి లేపి, అవి అన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అండీ.. మీరు అవి ఏవి మనసులో పెట్టుకొకండి.. మీరు సంతోషంగా ఉండాలి అని, ఇవి అన్ని చెస్తే మీరు కన్నీళ్ళు పెట్టుకోవటం ఏమి బాలేదు అండి.. అయితే మీరు నేను అన్న మాటలకి ఏమి బాధపడలేదా! నిజం చెప్పండి.. ఆ క్షణానికి అప్పుడు బాధ పడ్డ తరువాత మర్చిపోయాను అండి.. అయితే క్షమించినట్టేనా!! అబ్బా మీరు ఏం తప్పు చేసారు అని క్షమించడానికి.. ఇదే మరి! అని బుంగమూతి పెట్టింది.. సరె, సరె! క్షమించానులెండి.. ఇక నుంచి అండి, గిండీలు ఏమి లేవు.. మీరు నన్ను సీత అని పేరు పెట్టి పిలవాలి.. నేను మిమ్మల్ని ఏవండీ అని పిలుస్తాను... మీరు నా రాణీగారు అండి.. మిమ్మల్ని అలా గౌరవించి పిలవటమే నాకు ఇష్టం.. ఇదిగో మరి... హా!! మీరు ఇలా నన్ను ఏయ్, ఓయ్ అని పిలిస్తేనె నాకు ఇష్టం.. కానీ, మీరు అండి,గిండీ అని అనటం నాకు నచ్చలేదు.. సరె, అండి అని పిలవనులెండి రాణీగారు.. ఏయ్ అని ప్రేమగా భర్తని అల్లుకుపోయింది...

భార్యా భర్తల బంధం విడదీయలేనిది అని మీరు అర్థం చేసుకున్నారు.. నాకు చాలా సంతోషంగా ఉంది రాణీగారు..

జరిగినది అంతా తలుపు దగ్గర నిలబడి ఉన్న రాజ్యలక్ష్మి, ఆనందంతో కళ్ళ వెంట వస్తున్నా నీరుని, పమిట చెంగుతో తుడుచుకొని, మనసులోనే ఇద్దరిని ఆశీర్వదించి, ఆ భగవంతుడికి కృతఙ్ఞతలు చెప్పుకొని వెళ్లిపోయింది......!!

Post a Comment

0 Comments