కరోనాపై నిజాలు

కరోనాపై నిజాలు

SHYAMPRASAD +91 8099099083
0
కరోనాపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్నెన్నో కట్టు కథలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఫేక్ న్యూస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కల్పితాలపై యూఎస్ కు చెందిన డాక్టర్ క్లారిటీ ఇచ్చారు. అంటువ్యాధుల స్పెషలిస్ట్, ఫిలాంత్రఫిస్ట్ ఫాహిమ్ యూనస్ అపోహలు, వాటికి సమాధానాలను ట్విట్టర్​లో షేర్ చేశారు. అవేమిటంటే…

ప్రచారం: సమ్మర్ లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుంది?

నిజం: తగ్గదు. ఇంతకుముందు వచ్చిన ఇలాంటి మహమ్మారి రోగాలేవీ వెదర్ కండీషన్స్ ను ఫాలో కాలేదు. అదే విధంగా మనం సమ్మర్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు… దక్షిణార్ధ గోళంలో వింటర్ ఉంటుంది.  వైరస్ ఈజ్ గ్లోబల్.

ప్రచారం: కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైంది ఇంట్లోని ప్రతి డోర్ పిడిని డిస్ ఇన్ఫెక్టెంట్స్ తో క్లీన్ చేయడమే?


 
నిజం: తప్పు. చేతులు కడుక్కోవడం, కరోనా బాధితులకు 6 ఫీట్ల దూరంలో ఉండడం ముఖ్యమైన పని. మీ ఇంట్లో కరోనా పేషెంట్ లేనంత వరకు, మీ ఇంట్లోని ఉపరితలాలతో రిస్క్ లేదు.

ప్రచారం: కారు యాక్సిడెంట్లతో ప్రతిఏటా 30వేల మంది మరణి స్తున్నారు. అలాంటిది కరోనా దానికంటే పెద్దదా?

నిజం: కారు యాక్సిడెంట్ అనేది అంటువ్యాధి కాదు. అలాగే యాక్సిడెంట్స్ లో మరణాల రేటు ప్రతి మూడు రోజులకు ఒకసారి డబుల్ కాదు. యాక్సిడెంట్లతో ఇంతమంది జనం భయపడరు. మార్కెట్లు క్రాష్ కావు.

ప్రచారం: సమ్మర్ లో దోమల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందుతుంది?

నిజం: తప్పు. ఈ వైరస్ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బ్లడ్ ద్వారా కాదు. కావున దోమ కాటు వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందదు.

ప్రచారం: ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 సెకన్లు శ్వాస తీసుకోవడం ఆపగలిగితే… కరోనా లేనట్లే?

నిజం: తప్పు. కరోనా పేషెంట్లు చాలామంది 10 సెకండ్ల కంటే ఎక్కువ సేపు శ్వాసను ఆపగలరు. అలాగే వైరస్ సోకని పెద్దలు చాలామంది ఇలా చేయలేరు.


 
ప్రచారం: కరోనాకు టెస్టు అందుబాటులో లేనందున, మేం రక్తదానం చేయాలనుకుంటున్నాం. బ్లడ్ బ్యాంక్ కరోనా టెస్టు చేస్తుందా?

నిజం: కరోనా వైరస్ గురించి ఏ బ్లడ్ బ్యాంక్ కూడా టెస్టు చేయదు. కాబట్టి ఈ ప్రయత్నం విఫలమవుతుంది. రక్తదానమనేది ఒక మంచి పని. సరైన కారణాలతోనే అది చేస్తే బాగుంటుంది.

ప్రచారం: సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఓవర్ రియాక్షన్. ఈ వైరస్ తో పెద్ద నష్టమేమీ ఉండదు?

నిజం: ఒకవేళ వైరస్ ఎక్కువ మందికి సోకకపోతే సోషల్ డిస్టెన్సింగ్ పనిచేసినట్లే. వైరస్ పెద్ద విషయం కాదని ఎప్పుడూ అనుకోవద్దు.

ప్రచారం: కరోనా వైరస్ గొంతులో జీవిస్తుంది. ఎక్కువ వాటర్ తాగితే.. అది కడుపులోకి వెళ్తుంది. అక్కడ యాసిడ్స్ దాన్ని చంపేస్తాయి?

నిజం: వైరస్ గొంతు ద్వారానే ప్రవేశిస్తుంది కావచ్చు. కానీ అది కణాల్లోకి ప్రవేశిస్తుంది. నీళ్లు తాగి సెల్స్ నుంచి దాన్ని పంపించలేం. ఎక్కువ వాటర్ తాగడం వలన మీరు తరచూ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుందంతే.


 
ప్రచారం: సోప్, వాటర్ కంటే హ్యాండ్ శానిటైజర్స్ బెటర్.

నిజం: తప్పు. సోప్, వాటర్ వైరస్ ను చంపేస్తాయి. మన స్కిన్ పైనున్న వైరస్ ను తొలగిస్తాయి. ఒకవేళ సూపర్ మార్కెట్​లో శానిటైజర్స్ దొరక్కపోయినా బాధపడకండి

అపోహలను నమ్మకండి. అవగాహన పెంచుకోండి. వక్తిగత పరిశుభ్రత పాటించండి.
ప్రతి ఒక్కరు కరోన వైరస్ వ్యాప్తి చెందకుండా బాధ్యతాయుతంగా ఉండండి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!