ఒంటరి వర్సస్ సంఘ జీవితం

ఒంటరి వర్సస్ సంఘ జీవితం

SHYAMPRASAD +91 8099099083
0


“ఒంటరి వర్సస్ సంఘ జీవితం”

అమ్మా... మీ అబ్బాయి క్లాసు లో ఎప్పుడూ ఒంటరిగా కూర్చుంటాడు.. ఎవరితోనూ కలవడు..
ఎవరికేని చూపించండి.. టీచర్ సలహా...

సర్ ... మీ వాడు చదువు మీద ద్రుష్టి పెట్టకుండా హక్కులు పోరాటాలు అని ఇరవై నాలుగు గంటలు ఇతరుల ధ్యాస తప్ప... తన చదువు, కెరీర్ గురించి ఆలోచించడు... డిగ్రీ చదువుతున్న ఇంకా ఈ రకంగా ఇమ్మేచ్యుర్ తత్వం అనేది.... తరువాత అతని వ్యక్తిగత జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది... కొంచం ఆలోచించండి ... ప్రిన్సిపల్ హెచ్చరిక...

జ్ఞాన కేంద్ర కుటుంబ చిట్టి చిన్నారి ఆలోచన .....

1. మనిషి మనుగడకు ఒంటరితనం, సంఘజీవిగా వుండే రెండు పరిస్థితులు అవసరమే.... 

2. కాని, ఏ సమయంలో ఎలా వుండాలో తెలీక, అవగాహన లేక... ఎందరు హెచ్చరించినా తుంటరి తనంతో  ఐసోలేషనులో వున్న వాళ్ళని...  ఈ రోజు  పరామర్శించలేని పరిస్థితి.....

జ్ఞాన కేంద్ర కుటుంబ చిట్టి చిన్నారి అవగాహన.....

1. ఒంటరి జీవితము అంటే... రోజులో కొద్ది క్షణాలైనా... తన వ్యక్తిగతం గురించి... ఈ యాంత్రిక యుగంలో చేసే పనులు, వాటి నిర్వహణలో తనకున్న లక్షణాలు మేలు చేసాయా.. కీడు చేసాయా.. ఆ కార్యనిర్వహణ కష్ట సాధ్యం అయితే.. ఏ రకంగా సంఘంలో మసులుకొనే నైపుణ్యాలు అవసరము, వాటిని ఎలా పొందాలి అనే ఆలోచన ప్రతీ నిత్యం పవళింపు సేవకు ముందు విశ్లేషించుకోవటం అనే ప్రక్రియ శ్వాస వున్నంతవరకు చేసే అలవాటు గావించుకునే ప్రయత్నం ...

ఇప్పటి లాకు డౌన్ సమయం చాలా అనువైనది....

2.తనను తాను ఏ రోజుకారోజు వ్యక్తిగత ప్రక్షాళన చేసుకొనే అవకాశం కలగ జేసుకుంటే... వ్యక్తిగత శారీరక, మానసిక ఆరోగ్యం లభించడమే కాకుండా... సంఘంలో గౌరవం కూడా లభిస్తుంది....

3. నేటి సమాజంలో చాలా మంది... వారి వ్యక్తిగత అంటే పూర్తి స్వీయం, కుటుంబ సభ్యులు ఆలోచసకూడా లేని తనను తాను పూర్తిగా విస్మరించి... కుటుంబం గురించి  సంఘం గురించి శ్రమిస్తూ వుంటే... 

ఆ ఒత్తిడి జీవితంలో తన స్వీయ ఆరోగ్యం, పుట్టుకతో వచ్చిన నైపుణ్యాలు, సరదాలు మరచి... ఏదో యాంత్రికంగా బ్రతికే శ్రేయోభిలాషులకు సూచన....

1. ఇంటి పెద్ద, సంఘ పెద్ద  ... అన్ని రకాల ఇబ్బందులకు తట్టుకుని, ఏ విషయంలో త్యాగం చేయాలి, ఏ విషయంలో కఠిన ధోరణి వహించాలి అనే సున్నిత అంశాన్ని... హేండిల్ చేయగలిగే సమర్ధత కలిగి వుంటే.... 

2.అతను వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలలో అందరికి తలలో నాలుకై ... చిరకాలం కొన్ని తరాలకు ఆదర్శ మూర్తిగా శ్లాఘించబడతాడు..

గావున... ఒక్కసారి... గడచిన జీవిత రీలును వెనుకకు త్రిప్పి; ఇప్పటికైనా... మీ వ్యక్తిగత అభిరుచులు, చిన్ననాటి కోరికలు, నైపుణ్యాలు వెలికి తీసి; వాటిని సఫలీకృతం చేసే ప్రయత్నానికి నడుం బిగించి ... ఏదో కోల్పాయననే భావన లేకుండా వుంటారని... ఆ ప్రోసెస్ కి అధిక సమయం పట్టదని... కొంత ప్రయత్నం చేస్తే.. అద్భుత స్వీయ మానసిక ఆనందం మీకే సొంతం.... 

This lock down period is golden opportunity to practice the above and to know how am I ? and to know what self transformation is required to be a better citizen.....

Make cent percent utilisation by staying at home inorder not to become panic of leizure ....

All the Best....

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!