రామాయణంలో స్త్రీపాత్రలు.

రామాయణంలో స్త్రీపాత్రలు.

SHYAMPRASAD +91 8099099083
0

రామాయణంలో స్త్రీపాత్రలు
------------------------------------------------
అంజన - కుంజరుని కుమారై వానర స్త్రీ. కేసరి భార్య. ఆంజనేయుని తల్లి.

అనసూయ - అత్రి మహర్షి భార్య. సీతకు పతివ్రతాధర్మాలను బోధించింది.

అరుంధతి - వశిష్ట మహర్షి భార్య.

అహల్య - గౌతముని భార్య. పతివ్రత. రాముని పాదము సోకగానే శాప విముక్త అయ్యింది.

ఊర్మిళ - లక్ష్మణుని భార్య, జనక మహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె నిద్రిస్తూ ఉందిట.

కైకసి - రావణుడు, కుంభకర్ణుల తల్లి.

కైకేయి - దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.

కౌసల్య - దశరథుని మొదటి భార్య. రాముని తల్లి.

ఛాయాగ్రాహిణి - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

జంఝాట - ?

తాటకి - మారీచ, సుబాహువుల తల్లి. రాక్షసి.

తార - వాలి భార్య. అంగదుని తల్లి. వాలి మరణానంతరం అతని తమ్ముడు సుగ్రీవుడు ఈమెను పెళ్లాడాడు.

త్రిజట - రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకతె.

ధన్యమాలిని - రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.

నల - విభీషణుని కుమార్తె.

మండోదరి - రావణుడి భార్య. ఇంద్రజిత్తు, మేఘనాథుల తల్లి.

మంథర - కైకేయి చెలికత్తె. కైకేయికి దుర్బోద చేసి రాముడు అరణ్యవాసం చేయడానికి కారకురాలు అయ్యింది.

మాండవి - కుశధ్వజుని కుమార్తె. భరతుని భార్య.

రేణుకాదేవి - జమదగ్ని భార్య. పరశురాముని తల్లి.

లంకిణి - లంకను కాపలాగా ఉన్న ఒక రాక్షసి .

వేదవతి - సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.

శబరి - రాముని భక్తురాలు. సిద్ధయోగిని. మతంగమహర్షి శిష్యురాలు. రాముని రాకకై ఎదురు చూసిన వృద్ధురాలు.

శాంత - దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.

శూర్పణఖ - రావణుని చెల్లెలు. రాముని వనవాస కాలంలో అతనిపై మోజుపడింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేశాడు.

శ్రుతకీర్తి - కుశద్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య.

సరమ - విభీషణుని భార్య.

సింహిక - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.

సునయన - జనక మహారాజు భార్య.

సుమిత్ర - దశరథుని భార్య. లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి.

సురస - నాగమాత. హనుమంతునిచే ఓటమి పాలయ్యింది.

సులోచన - ఇంద్రజిత్తు భార్య

సీత - జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో లభించింది. రాముని భార్య.
----------------------------------------------------------------------------------------------- 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!