చెప్పుకోండి చూద్దాం!

చెప్పుకోండి చూద్దాం!
...........................................

(1) దేశభాషలందు తెలుగు లెస్స అని కీర్తించినదెవరు ?

క్రీడాభిరామం గ్రంధకర్త వినుకొండ వల్లభరాయుడు. శ్రీకృష్ణదేవరాయల కంటే దాదాపు వంద సం॥ ముందరివాడు.ఇతని తరువాతనే శ్రీకృష్ణదేవరాయలు కీర్తించాడు.

(2) రాయలసీమకు ఆ పేరును సూచించిన వారెవరు ?

నిజానికి చిలుకూరి నారాయణరావు గారు సూచించారు. ఎందుకోకాని గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారని స్థిరపడిపోయింది.

(3) ఆంధ్రప్రదేశ్ రాజముద్ర పూర్ణకుంభం.దీనిని ఏ శిల్పం నుండి తీసుకోవడం జరిగింది ?

అమరావతి బౌద్ధస్ధూపం నుండి

(4) తెలుగులో తొలి శాసనం కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో దొరికింది.వేయించిన వారెవరు ?

రేనాటి ప్రభువు ఎరికల్ ముత్తు రాజు బిరుదుగల ధనుంజయుడు.

(5) తెలుగులో మొదటి నవల వీరేశలింగం పంతులుగారు వ్రాసిన రాజశేఖరచరిత్రమంటారు. కాని కొంత మంది విమర్శకులు నరహారగోపాలశెట్టి వ్రాసిన శ్రీరంగరాజు చరిత్రమే  మొదటి నవలంటారు. ఇంతకు నరహారగోపాలశెట్టి ఎవరు? ఏ వూరిలో ఉద్యోగి ?

డిప్యూటి కలెక్టరు,నంద్యాల. కర్నూలు జిల్లాలో

(6) అక్కన్న మాదన్నలతోపాటు చంపబడ్డ వారి అల్లుడెవరు ?

రుస్తుంరావు

(7) ప్రాచీనకాలంలో పికండక, మెకడొన, మైసోలియా అని పిలువబడ్డ ఇప్పటి పట్టణాల పేర్లేమిటి ?

అనంతపురం జిల్లాలోని పెనుకొండ, ఆదోని, మచిలిపట్నం

(8) చిలకడదుంపకు గల మరో పేరు ?

గెనుసు గడ్డ

(9) మనిషిలో ఒక అవయవాన్ని బాధించినా నొప్పి తెలియదు ఏమిటది? వెంట్రుకలు గోళ్ళు మాత్రం కాదు!

మెదడు

(10) కాళ్ళు చేతులు లేనివాడు కాళ్ళు చేతులున్నవాడిని పట్టుకొన్నాడట... ఈ పొడుపు కథను విప్పండి.

పొడుపు కథ పూర్తిపాఠం....
కాళ్ళు చేతులు లేనివాడు కాళ్ళు చేతులు వున్నవాడిని పట్టుకొంటే తలలేనివాడు చూచి నవ్వాడట.

పాము కప్పను పట్టుకొంటే ఎండ్రి (పీత) నవ్విందట.

పాముకు కాళ్ళుచేతులు లేవు. కప్పకు కాళ్ళుచేతులు వున్నాయి. ఎండ్రికి తలలేదు కదా!

సద్విమర్శలు చేయండి.
................................................................................... 

Post a Comment

0 Comments