కథ - ఈనోటా ఆనోటా

కథ - ఈనోటా ఆనోటా

SHYAMPRASAD +91 8099099083
0
*👴ఒక ముసలాయన పక్కింటి కుర్రాడు దొంగ అని ప్రచారం మొదలు పెట్టాడు.రోజుకి ఒకరితో ఇలా చెబుతూ ఉండేసరికి ఈనోటా ఆనోటా విషయం పోలీస్ వరకూ వెళ్ళింది.అనుమానం కొద్దీ అతడిని అరెస్ట్ చేశారు.

కేసు నడిచింది.విచారణ అనంతరం ఈయనే ఆ పుకార్లకు కారణం అని తేలింది.అతడిని వదిలి పెట్టేశారు.*

*👨‍💼ఆ యువకుడికి అవమానంగా తోచి ముసలాయన పై కేసు పెట్టాడు.కేసు విచారణలో ముసలాయన ఊరికే నేను అన్నాను అంతే,దాని వలన అతడికి హాని ఏమీ జరగలేదు కదా అన్నాడు.*

*🤔నీవు అతడి గురించి ఏమేమి అన్నావో అవి అన్నీ ఒక పేపర్ రాసి,ఆ పేపర్ చిన్న చిన్న ముక్కలు చేసి నువ్వు ఇంటికి వెళ్ళే దారిలో విసిరెయ్యి.కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. రేపు తీర్పు చెబుతాను " అని జడ్జి అన్నారు.*

*🙂జడ్జి చెప్పిన ప్రకారం చేశాడు ముసలాయన మర్నాడు కోర్ట్ కి వెళ్ళాడు.*

*😇"నిన్న నువ్వు పారేసిన ముక్కలు అన్నీ తీసుకురా!" అన్నారు జడ్జి.*

*🤔"అదెలా సాధ్యం? అవి గాలికి ఎక్కడెక్కడికో వెళ్లి పోయి ఉంటాయి.వాటిని తేవడం అసాధ్యం " అన్నాడు ముసలాయన.*

*✍"నువ్వు చేసిన చిన్న చిన్న కామెంట్స్ అతడి జీవితాన్ని ఎంతో మార్చేశాయి.అది తిరిగి యధాస్థితికి రావడం అసాధ్యం. నువ్వు ఒకరి గురించి మంచి మాట్లాడక పోతే పోయావు. చెడు ఎప్పడూ మాట్లాడకు."*

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!