శకుంతలా దేవి (Shakuntala Devi)

శకుంతలా దేవి (Shakuntala Devi)

SHYAMPRASAD +91 8099099083
0
శకుంతలా దేవి(Shakuntala Devi) బెంగుళూరు నగరంలో కన్నడ పూజారి కుటుంబంలో 1929 లో జన్మించారు.ఆమె తండ్రి పూజారిగా ఉండడానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసములు చేయుటకు
నియమింపబడ్డాడు.మూడేళ్ల వయసులోనే శకుంతలా దేవి పేకలతో ట్రిక్కుల చేయడంలో ప్రతిభని ఆమె తండ్రి గమనించాడు.ఆమెని చదివించాలి అనుకున్నారు.ఒకటో తరగతిలో జాయిన్ చేసారు.కాని పేదరికం కారణంగా ఒకటో తరగతి మద్యలోనే ఆమె చదువుని మానిపింప చేసారు.తరువాత శకుంతలా దేవి జ్యోతిష్యం మీద మక్కువ చూపించింది.జ్యోతిష్యం అంటే మూఢనమ్మకం అని చెప్పే నాస్తికులు&ఇతర మతస్ధులు కి తెలియదు దానిలోని గొప్పతనం.దానిలో ఉండే గణితాన్ని పరిష్కరించడం అత్యంత క్లిష్టతరం.అటువంటి జ్యోతిష్యం మీద శకుంతలా దేవి మక్కువ చూపడం వల్లే ఆమె హ్యుమన్ కంప్యూటర్ అనే బిరుదు దక్కుంచుకొగల్గింది.కంప్యూటర్ కన్నా స్పీడ్ గా లెక్కలు చేయగల్గింది.అమెరికాలో 1977 లో శకుంతలా దేవికి ఒక కంప్యూటర్ తో పోటి పెట్టారు.1888132517 × 18888132517×18888132517 ఎంత అని పోటి పెట్టక ఆమె కంప్యూటర్ ని ఓడించేసారు. 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు.76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరి యల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంత మైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.
గత శతాబ్దిలో ఏ ఏడాదిలో ఏ నెలలో ఏ తేదీన ఏ వారం వచ్చిందో.. నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్పే మేధస్సు ఆమె సొంతం.ఆమె ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు.తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.


జై భారత్

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!